OMG: రన్నింగ్‌లో ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైర్..

ఇలాంటి ఫిట్‌నెస్ లేని బస్సులను ఘాట్‌ రోడ్ల మీద నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాటొద్దని ప్రయాణికులు మండిపడ్డారు.

news18-telugu
Updated: October 16, 2019, 5:09 PM IST
OMG: రన్నింగ్‌లో ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైర్..
ఊడిపోయిన బస్సు డ్రైవర్
  • Share this:
కడప జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. రన్నింగ్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు టైరు ఊడిపోయి, 20 అడుగుల దూరంలో పడిపోయింది. మైదుకూరు నుండి బ్రహ్మంగారి మఠం వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టైరు ఊడిపోవడంతో అక్కడే ఆగిపోయింది బస్సు. కొండ ఎక్కే సమయంలో బస్సు స్పీడ్ తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండదిగే సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని వాపోయారు. ఇలాంటి ఫిట్‌నెస్ లేని బస్సులను ఘాట్‌ రోడ్ల మీద నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాటొద్దని మండిపడ్డారు.
ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు
First published: October 16, 2019, 5:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading