గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో APPSC కీలక నిర్ణయం

ట్యాబ్​ను పరీక్ష కేంద్రాల్లో ఎలా ఉపయోగించాలన్న వివరాలు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్​సైట్లో అందుబాటులో ఉంచారు అధికారులు.

news18-telugu
Updated: January 15, 2020, 2:57 PM IST
గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో APPSC కీలక నిర్ణయం
ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్‌భాస్కర్‌
  • Share this:
గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి
ట్యాబ్​ల ద్వారా ప్రశ్నపత్రాలు ఇవ్వాలని కమిషన్ నిర్ణయించింది. వచ్చే నెలలో జరగనున్న ఈ పరీక్షల్లో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేయనుంది. జవాబులు రాయటానికి ఎప్పటిలాగానే పేపర్లు అందించనుంది. ట్యాబ్​ను పరీక్ష కేంద్రాల్లో ఎలా ఉపయోగించాలన్న వివరాలు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్​సైట్లో అందుబాటులో ఉంచారు అధికారులు. పరీక్ష రాసిన అనంతరం అభ్యర్థుల నుంచి ట్యాబ్​లను వెనక్కి తీసుకుంటారన్నారు. ఎనిమిది వేల మందికి పైగా అభ్యర్థులు ఈ ఏడాది గ్రూప్ వన్ పరీక్షలకు హాజరవ్వనున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: January 15, 2020, 2:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading