రమేష్ కుమార్ తర్వాత కొత్త వివాదం... జగన్ వర్సెస్ ఏపీపీఎస్సీ చైర్మన్...

ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు మూడు పేజీల లేఖ అందించినట్టు తెలిసింది.

news18-telugu
Updated: March 21, 2020, 7:33 PM IST
రమేష్ కుమార్ తర్వాత కొత్త వివాదం... జగన్ వర్సెస్ ఏపీపీఎస్సీ చైర్మన్...
ఏపీ సీఎం వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ వివాదం ఇంకా పూర్తిస్థాయిలో చల్లారక ముందే మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పిన్నమనేని ఉదయ్ భాస్కర్... సీఎం జగన్ ప్రభుత్వంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తనను పక్కనపెట్టి ఇన్‌చార్జి చైర్మన్‌ను నియమించారని, తాను చేయాల్సిన పనులు అన్నీ సెక్రటరీతోనే చేయిస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అలాగే, మూడు పేజీల లేఖను అందించినట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఏపీపీఎస్సీ సభ్యుడిని నేరుగా ఇన్‌చార్జి చైర్మన్‌గా నియమించారని, వాస్తవానికి ఇన్‌చార్జి చైర్మన్‌ను నియమించే అధికారం కేవలం గవర్నర్‌కు మాత్రమే ఉందని ఉదయ్ భాస్కర్ హరిచందన్‌కు చెప్పినట్టు తెలిసింది. ఆ రకంగా గవర్నర్ అధికారాలను కూడా జగన్ ప్రభుత్వం అతిక్రమిస్తోందని ఆయన ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో APPSC కీలక నిర్ణయం, APPSC decide to conduct group 1 exam with tabs
ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్‌భాస్కర్‌


ఏపీపీఎస్సీ చైర్మన్ అయిన తనకు కనీసం పేషీలో పీఏ కూడా లేడని, ఉన్న పీఏను కూడా తీసేశారని ఉదయ్ భాస్కర్ ఆరోపించారు. కనీసం డోర్ తీసే అటెండర్‌ను కూడా తీసేసి తనను అవమానించారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. నాలుగు నెలల నుంచి తనకు ఒక్క ఫైల్ కూడా రాలేదని, చైర్మన్‌తో సంబంధం లేకుండా అన్ని పనులు సెక్రటరీతోనే చేయిస్తున్నారని ఆరోపించారు. తన ప్రమేయం లేకుండానే నాలుగు నెలలుగా అనేక రిక్రూట్‌మెంట్లు చేశారని కూడా తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమించారు కాబట్టే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గవర్నర్ హరిచందన్‌కు ఉదయ్ భాస్కర్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: March 21, 2020, 7:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading