Home /News /andhra-pradesh /

APPLE IS LIKELY TO ESTABLISH MOBILE MANUFACTURER PLANT IN KADAPA SK

గుడ్‌న్యూస్.. ఏపీలో యాపిల్ ఫోన్ల తయారీ యూనిట్..! ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యాపిల్ ప్లాంట్ ద్వారా సుమారు 50వేల మంది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు గౌతమ్ రెడ్డి.

    పారిశ్రామిక రంగంలో ఏపీ దూసుకుపోతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఫస్ట్ ర్యాంక్‌లో నిలిచి సత్తా చాటుతోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ఏపీకి విస్తరించడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ 'కియా' అనంతపూర్‌లో కార్ల తయారీ యూనిట్ నెలకొల్పింది. ఆ యూనిట్ నుంచి ఏటా వేల సంఖ్యలో కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. కియా రాకతో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించాయి. తాజాగా ఏపీకి మరో దిగ్గజ కంపెనీ వస్తున్నట్లు తెలిసింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ యాపిల్.. మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్‌ను రాయలసీమ ప్రాంతంలోనే ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం.

    మొబైల్స్ తయారీ యూనిట్‌ కోసం కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతాన్ని యాపిల్ సంస్థ ఎంచుకున్నట్టు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మంగళవారం వెల్లడించారు. యాపిల్ కంపెనీకి చైనాలో ఆరు తయారీ యూనిట్స్ ఉన్నాయని.. అక్కడ ఒక్కో తయారీ యూనిట్ లో లక్ష నుండి ఆరు లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారని ఆయన తెలిపారను. అదే తరహా యూనిట్‌ను కడపలో నిర్మించడానికి యాపిల్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు మేకపాటి గౌతమ్‌రెడ్డి. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 50వేల మంది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు గౌతమ్ రెడ్డి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Apple, Business

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు