వాళ్లు పెయిడ్ ఆర్టిస్టులు..చంద్రబాబును మరోసారి టార్గెట్ చేసిన రోజా

పెయిడ్ ఆర్టిస్టులను నీటితో నిలబెట్టి సీఎం జగన్‌పై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు రోజా.

news18-telugu
Updated: August 22, 2019, 3:34 PM IST
వాళ్లు పెయిడ్ ఆర్టిస్టులు..చంద్రబాబును మరోసారి టార్గెట్ చేసిన రోజా
రోజా, చంద్రబాబు నాయుడు(File)
  • Share this:
ఏపీ వరదలపై బురద రాజకీయ కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తన ఇంటిని ముంచేందుకే కృత్రిమ వరదలను సృష్టించాన్న చంద్రబాబు ఆరోపణలపై APIIC ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే మండిపడ్డారు. జగన్ సీఎం అయ్యాక రిజర్వాయర్లన్నీ నిండడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు. పెయిడ్ ఆర్టిస్టులను నీటితో నిలబెట్టి సీఎం జగన్‌పై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు రోజా.


చంద్రబాబు ఉన్నన్ని రోజులు వర్షాలు లేక రిజర్వాయర్లు ఎండిపోయాయి. ఆయన అడుగుపెడితే చాలు కరువు వచ్చే పరిస్థితి ఉండేది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి. రైతులంతా సంతోషంగా ఉండడాన్ని జీర్ణించుకోలేక జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. జగన్‌పై ఎలాగైనా బురదజల్లాలనే ఉద్దేశంతో నీళ్లలో పెయిడ్ ఆర్టిస్టులని నిలబెట్టి విమర్శలు చేయిస్తున్నారు.
రోజా, వైసీపీ ఎమ్మెల్యే


ఇక లోకేష్ ట్వీట్ చేసిన పడవ ఫొటోపైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు రోజా. పడవను అడ్డంపెట్టి వరదను ఆపిగలిగితే వేల కోట్లు పెట్టి డ్యామ్‌లు కట్టాల్సిన అవసరమేంటని అభిప్రాయపడ్డారు. తన తెలివితక్కువ తనాన్ని మరోసారి నిరూపించుకున్నారని లోకేష్‌పై సెటైర్లు వేశారు. తెలంగాణలో జరిగిన ఆశావర్కర్ల ధర్నాని సైతం ఏపీలో జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలపై మండిపడ్డారు నగరి ఎమ్మెల్యే.
Published by: Shiva Kumar Addula
First published: August 22, 2019, 3:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading