అనంతపురంలో మిడతల గుంపుపై స్పందించిన వైసీపీ ఎంపీ

రాయదుర్గం పట్టణంలోని దానన్ప రోడ్డులో ఓ ఇంటి ముందు జిల్లేడు చెట్లపై భారీగా మిడతలు వాలాయి. ఆ చెట్ల ఆకులను పూర్తిగా తినేశాయి.

news18-telugu
Updated: May 28, 2020, 9:03 PM IST
అనంతపురంలో మిడతల గుంపుపై స్పందించిన వైసీపీ ఎంపీ
అనంతపురంలో మిడతలు
  • Share this:
ఏపీలోని అనంతపురం జిల్లాలో మిడతల గుంపు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ తలారి రంగయ్య స్పందించారు. అనంతపురం వచ్చిన మిడతలతో ఎలాంటి ప్రమాదం లేదని.. అవి మహారాష్ట్ర నుంచి వచ్చిన ఎడారి మిడతలు కాదని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. రాజస్థాన్, మహారాష్ట్ర మీదుగా వచ్చే మిడతల వల్లే ప్రమాదం ఉంటుందని.. ప్రస్తుతానికి అరి రాష్ట్రానికి రాలేదని చెప్పారు.

కాగా, అనంతపురం జిల్లాలో ఓ మిడత సమూహం కలకలం రేపింది. రాయదుర్గం పట్టణంలోని దానన్ప రోడ్డులో ఓ ఇంటి ముందు జిల్లేడు చెట్లపై భారీగా మిడతలు వాలాయి. ఆ చెట్ల ఆకులను పూర్తిగా తినేశాయి. దాంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. మహారాష్ట్ర నుంచి మిడతల దండు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిందని ప్రచారం జరిగింది. ఐతే ఇందులో వాస్తవం లేదని ఎంపీ తలారి రంగయ్య స్పష్టం చేశారు.

First published: May 28, 2020, 9:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading