ఆ రేప్ కేసు సీబీఐకి అప్పగిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు...

2017లో కర్నూలు జిల్లాలో బాలికపై జరిగిన హత్యాచారం కేసును సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

news18-telugu
Updated: May 28, 2020, 8:19 PM IST
ఆ రేప్ కేసు సీబీఐకి అప్పగిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు...
వైఎస్ జగన్, సీబీఐ లోగో
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో అత్యంత దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన 14 ఏళ్ల బాలిక కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 2017లో కర్నూలు జిల్లాలో ఓ బాలిక మీద అత్యాచారం హత్య జరిగింది. కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో క్లాస్ రూమ్ లోనే ఉరేసుకుంది. ఆమె అత్యాచారం, హత్యకు గురైందని పోలీసులు తేల్చారు. హత్యాచారం కేసులో పలువురు టీడీపీ నేతలు, అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కర్నూల్లో ర్యాలీ నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్ జగన్ కూడా బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. అప్పుడే కేసును సీబీఐకి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మేరకు అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.

2017 నాటి హత్యాచారం కేసును సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు


అసలు ఎవరీమె? కర్నూలుకు చెందిన 14 ఏళ్ల బాలిక. టీడీపీ నేత వి.జనార్దన్ రెడ్డికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో చదివింది. 2017 ఆగస్ట్ 19న ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని స్కూల్ యాజమాన్యం చెప్పారు. అయితే, స్కూల్ అధినేత కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డిలు అత్యాచారం చేసి చంపారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. బాలికపై అత్యాచారం జరిగిందని పోస్టుమార్టం చేసిన వైద్యులు కూడా ధ్రువీకరించారు. కలెక్టర్ నియమించిన కమిటీ కూడా లైంగికదాడి తర్వాత హత్య జరిగినట్టు ధ్రువీకరించిందని కుటుంబసభ్యులు తెలిపారు.

sugali preethi,ap cm,ys jaganmohan reddy,kurnool,crime news,ap political news,ysr congress party,pawan kalyan,janasena
బాధితురాలి తల్లితో సీఎం జగన్ (File)


ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు 23 రోజుల్లో బెయిల్ వచ్చింది. ఆ తర్వాత కేసు నీరుగారిపోయింది. అయితే, బాధితురాలి తల్లిదండ్రులు ఎన్‌హెచ్ఆర్సీని ఆశ్రయించంతో వారి ఆదేశాల ప్రకారం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. కానీ, ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది. రాజకీయ నేతల పాత్ర ఉన్న ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తాజాగా దిశ హత్యాచారం మీద స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని లేవనెత్తడంతో మరోసారి పాత కేసు తెరపైకి వచ్చింది.
First published: May 28, 2020, 8:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading