ఒకప్పుడు స్టార్ హీరోలతో విజయవంతమైన సినిమాలు రూపొందించిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు.. ఇటీవల డర్టీ హరి అనే సినిమాను తెరకెక్కించారు. సినిమా ట్రైలర్, టీజర్లో రొమాన్స్ కాస్త శ్రుతి మించినట్టు కనిపించడంతో.. ఇది అడల్ట్ కంటెంట్ సినిమా అనే విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఈ సినిమా వాల్ పోస్టర్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత, దర్శకుడు, అడ్వర్టయిజ్మెంట్ ఏజెన్సీలపై కేసు నమోదు చేయాలని ఆమె ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ను కోరారు. ఈ పోస్టర్లు మహిళలను అగౌరవపరిచేలా, యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు.
గుంటూరు ఉండవల్లి సెంటర్లో, ఇతర పట్టణాలలో అసభ్యకరంగా వేసిన పోస్టర్లను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ విజ్ఞప్తి చేశారు. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ హీరోహీరోయిన్లుగా నటించారు.
వాసిరెడ్డి పద్మ (ఫైల్ ఫోటో)
ఫ్రైడే మూవీస్ యాప్ ద్వారా ఈనెల 18న ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాపై పలువురు అభ్యంతరం తెలపడంపై నిర్మాత ఎం.ఎస్. రాజు వివరణ ఇచ్చారు. ఇది రొమాంటిక్ సినిమా మాత్రమే అని వెల్లడించారు. ట్రెండ్‌కి తగ్గట్టుగా మారాలని అడల్ట్ కంటెంట్‌తో డర్టీ హరి తీశానని అన్నారు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా అని తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.