Home /News /andhra-pradesh /

AP WOMAN AND CHILD WELFARE DEPARTMENT RELEASED 50 LAKHS AND INSTRUCTED TO SPEND IN A DAY IN ANANTAPURAM FULL DETAILS HERE PRN

AP News: ఒక్కరోజులో రూ.50 లక్షలు ఖర్చు చేయాలి.. లేదంటే అంతా వేస్ట్.. ఇది సినిమా కాదు రియల్..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Anantapuram: డబ్బు ఖర్చు చేయడం చాలా ఈజీ అనుకుంటారంతా. దుబారా ఖర్చులు ఇష్టమొచ్చినట్లు చేయాలంటే ఎవరైనా చేస్తారు. కానీ ఓ పద్ధతి ప్రకారం, నిబంధనలు లోబడి, పై అధికారుల ఆమోదంతో ఖర్చు చేయాలంటే మాత్రం చాలా కష్టం. ప్రభుత్వ శాఖల్లో అయితే రోజులు కాదు నెలలు పడుతుంది.

ఇంకా చదవండి ...
    డబ్బు ఖర్చు చేయడం చాలా ఈజీ అనుకుంటారంతా. దుబారా ఖర్చులు ఇష్టమొచ్చినట్లు చేయాలంటే ఎవరైనా చేస్తారు. కానీ ఓ పద్ధతి ప్రకారం, నిబంధనలు లోబడి, పై అధికారుల ఆమోదంతో ఖర్చు చేయాలంటే మాత్రం చాలా కష్టం. ప్రభుత్వ శాఖల్లో అయితే రోజులు కాదు నెలలు పడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వ సొమ్ము రోజుల వ్యవధిలో ఖర్చు చేయడానికి వీలుంటుంది. సినిమాల్లో అయితే రోజుకి 50 లక్షలేంటి.. ఎంతైనా ఖర్చు చేసేయొచ్చు. సూపర్ స్టార్ రజనికాంత్ అరుణాచలం సినిమాలో 30 రోజుల్లో రూ.30 కోట్లు ఖర్చు చేస్తే.. రూ.3వేల కోట్ల ఆస్తులు దక్కుతాయని.. ఐతే ఆ విషయం ఎవరికీ చెప్పకూడదనే కండీషన్ కూడా ఉంటుంది. అన్ని ఆటంకాలు ఎదుర్కొని హీరో ఆ డబ్బు ఖర్చు చేస్తాడు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram) ఐసీడీఎస్ అధికారులు మాత్రం ఒక్క రోజులో రూ.50లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ పనులేగా.. రూ.50లక్షలు ఎంతసేపు ఇట్టే అయిపోతుందని అందరూ అనుకోవచ్చు. కానీ అంతా రూల్ ప్రకారం జరగాలి. ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి అనంతపురం ఐసీడీఎస్ పీడీ ఎకౌంట్ కు రూ.50లక్షలు వచ్చాయి. ఆర్ధిక సంవత్సరం ముగింపులోపు డబ్బులు ఖర్చు చేయాలని ఆదేశాలు కూడా వచ్చాయి. అంటే ప్రభుత్వం నిర్దేశించిన అంశాల ప్రకారం ఖర్చు చేసి సంబంధించి బిల్లుల ట్రెజరీకి సమర్పించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

    ఇది చదవండి: కాకినాడలో మిస్సింగ్.. విజయవాడలో ప్రత్యక్షం.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన యువతి..


    ప్రస్తుతం అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టి అనేలా తయారైంది అనంతపురం జిల్లా అధికారుల పరిస్థితి. ఒక్కరోజులో డబ్బులు డ్రా చేసి ప్రభుత్వం ఇచ్చిన అంశాల ఆధారంగా సామాగ్రి, ఇతర అవసరాలపై ఖర్చు చేసి ఈనెల 31నాటికి ట్రెజరీలో బిల్లులు సమర్పించాలి. లేదంటే రూ.50 లక్షలు వెనక్కివెళ్లిపోతాయి. ప్రభుత్వంలో ఇదంతా ఒక్కరోజులో సాధ్యమవుతుందా అని జిల్లా అధికారులు ప్రశ్నిస్తున్నారు.

    ఇది చదవండి: ఈ దుర్మార్గులకు గరుడ పురాణంలో శిక్షలే కరెక్ట్..! పసికందుతో వ్యాపారమా..?


    ఇదిలా ఉంటే రూ.50లక్షలు బడ్జెట్‌ ఒక్కరోజులో ఖర్చు చేయాలనే సమాచారం రావడంతో అధికారులు పరుగులుపెడుతున్నారు. ఏం కొనాలి.. ఎంత కొనాలి అనేదానిపై లెక్కలు వేసుకుంటున్నారు. ముందుకు పేపర్లు, కంప్యూటర్లు, స్కానర్లు, స్టాంపులు ఇలా ఆఫీసు అవసరాలకు వెంటనే ఏమేం కొనుగోలు చేయాల్సి వస్తుందో లిస్ట్ రాసుకుంటున్నారు. ఇన్నాళ్లు చిన్నచిన్న వస్తువుల కొనుగోలుకు అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక్కసారిగా నిధులు వచ్చిపడేసరికి వేటిపై ఖర్చు చేయాలో తెలియని పరిస్థితి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Anantapuram, Andhra Pradesh, Ap government

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు