Home /News /andhra-pradesh /

AP WELFARE SCHEME JAGANNANNA THODU FUNDS RELEASED BY CM JAGAN IF ANY ONE MISSS DO THIS NGS

Jagananna Thodu: జగనన్న తోడు నగదు ఇంకా అకౌంట్ లో జమకాలేదా..? ఇలా చేయండి

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

Jagananna Thodu: రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులుకు ఆర్థిక సాయం పేరుతో జగనన్న తోడు నగదును సీఎం జగన్ విడుదల చేశారు. అయితే జగనన్న పథకానికి అర్హులై ఉండి.. మీకు ఇంకా నగదు రాలేదా.. అయితే టెన్షన్ అవసరం లేదు ఇలా చేయండి.

ఇంకా చదవండి ...
  Jagananna Thodu: నేను విన్నాను.. నేను ఉన్నాను అని చెబుతూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి (CMJagan Mohan reddy).. మళ్లీ అదే మాటలను ప్రజలకు గుర్తు చేస్తున్నాను అన్నారు. తన కళ్లారా చిరు వ్యాపారుల కష్టాలను చూశానని.. అందుకే వారికి అండగా నిలవాలనే లక్ష్యంతో నగదు జమ చేస్తున్నాను అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం 510.46 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల పంపిణీకి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు (Iagananna thodu) లక్ష్యమని ఆనందం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డారు. లక్షల మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. ఇకపై వ వారి కాళ్లమీద వారు నిలబడడానికి ఎంతగానో ఈ పథకం ఉపయోగపడుతుందని అ‍న్నారు.

  పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లారా చూశాను అన్నారు సీఎం జగన్.. చిరు వ్యాపారులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామన్నారు. రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే మీకు మళ్లీ రుణం ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ 14 లక్షల మందికి మంచి చేయగలిగామని అన్నారు. మూడో విడత కింద 5,10,462 మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు.

  ఇదీ చదవండి : ఆ ముగ్గురు ఎంపీలూ వన్ టైం రాజకీయ నేతలేనా..? సెకెండ్ ఛాన్స్ లేదని ఫిక్స్ అయ్యారా?

  చిరువ్యాపారులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి 10వేల రుణం అందజేస్తోందని తెలిపారు. వడ్డీ రీఎంబర్స్‌మెంట్‌ 16.16 కోట్లు కలిపి మొత్తం 526.62 కోట్లు లబ్ధి చేకూరుతుందని అన్నారు. అర్హులై ఉండి రుణం రాకపోతే.. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే ఈ పథకానికి అర్హులై ఉండి.. లబ్ధి దారులకు నగదు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగదు అన్నారు. ఒకవేళ ఎవరికైనా సందేహాలుంటే 08912890525కు కాల్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ సచివాలయంలో అన్ని రకాల సహాయం దొరుకుతుందని సూచించారు. ఎటువంటి అవినీతికి తావులేకుండా లబ్దిదారులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరికైనా డబ్బులు రాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని.. స్థానిక సచివాయానికి వెళ్తే సరిపోతుంది అన్నారు.

  ఇదీ చదవండి ఏపీలో తెరపైకి కొత్త రాజకీయం.. మాజీ మంత్రి.. మాజీ డీజీపీ ఆధ్వర్యంలో వ్యూహాత్మక అడుగులు

  మరోవైపు కోవిడ్‌ కారణం చిరు వ్యాపారులు బాగా దెబ్బతిన్నారని సర్వేల్లో చూశానని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. నిరుపేదల కుటుంబాలను కాపాడేందుకు సంక్షేమ పథకాలను అమలు చేశామని అన్నారు. అవినీతికి తావులేకుండా పేదలకు రూ. 1.29 లక్షల కోట్లు అందించామని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో కంటే పేదలను మన రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకుందని గుర్తు చేశారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes

  తదుపరి వార్తలు