హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Rain alert: ఏపీకి భారీ వర్ష సూచన.. 3 రోజులు వానలే వానలు

Rain alert: ఏపీకి భారీ వర్ష సూచన.. 3 రోజులు వానలే వానలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాన కష్టాలు మరికొన్ని తప్పేలా లేదు. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీలో ఇప్పటికే వానలు దంచికొడుతున్నాయి. గోదావరి, కృష్ణ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఐతే ఈ వాన కష్టాలు మరిన్ని రోజులు తప్పేలా లేదు. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఒరిస్సా మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మరియు గాంగేటిక్ పశ్చిమబెంగాల్ ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారి అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 9.5 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని.. క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఉత్తర కోస్తా ఆంధ్ర:

ఈ రోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీవర్షాలు పడవచ్చు. విశాఖపట్నం జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి.

రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల మాత్రం భారీ వర్షాలు పడవచ్చు.

ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయి.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

ఈరోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి.

రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ :

ఈరోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి.

రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల పడవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, Monsoon rains

ఉత్తమ కథలు