Home /News /andhra-pradesh /

AP WEATHER UPDATE RAIN FORECAST FOR NEXT THREE DAYS SU

Andhra Pradesh Weather: తుపాన్ ఎఫెక్ట్.. రాగల మూడు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నైరుతి బంగాళాఖాతం, మరియు దాని అనుసంధానంగా ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు.

    నైరుతి బంగాళాఖాతం, మరియు దాని అనుసంధానంగా ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. భారత వాతావరణ శాఖ (ఐఎండి) సూచనల ప్రకారం.. వాయుగుండం 24 గంటల్లో తుపాన్‌గా బలపడనుందన్నారు. ఈ ప్రభావంతో రాగల 3 రోజులపాటు కోస్తాంధ్ర,రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. బుధ, గురు వారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంలో బలమైన గాలులు వీస్తాయని అన్నారు. సముద్రం అజలడిగా ఉంటుందని.. మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లద్దని సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు. రైతాంగం వ్యవసాయ పనులకు సంబంధించి అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తతలో ఉండాలని సూచించారు.

    ఇక, ఈ తుపాన్‌కు నివార్ అని పేరు పెట్టారు. ఇది తమిళనాడులోని కరైకల్, మహాబలిపురం దగ్గర నవంబర్ 25న మధ్యాహ్నం వేళ తీరం దాటే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ అధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో నవంబర్ 25 నుంచి తమిళనాడులోని చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు.

    తుఫానును దృష్టిలో పెట్టుకొని... తమిళనాడు, పుదుచ్చేరికి సైక్లోన్ అలర్ట్ జారీ చేశారు. నవంబర్ 22 నుంచి జాలర్లు... చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా నవంబర్ 22 నుంచి 25 వరకూ తుఫాను వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి... ఎట్టి పరిస్థితుల్లో బంగాళాఖాతంలోకి వెళ్లొద్దని కోరారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Andhra Pradesh, Rains, WEATHER

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు