తెలుగు రాష్ట్రాల్లో ఎండలు షురూ అయ్యాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. అయితే ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు అందింది. ఇదిలా ఉంటే మార్చి 16 నుంచి ఏపీతో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఈసారి వర్షాలు వేసవిలోనూ మనల్ని పలకరించనున్నాయి.
ఏపీలో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమ గాలుల వల్ల ఏర్పడిన ద్రోణి సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఉంది. ఎత్తైన ప్రదేశం నుండి 7.6 కి.మీ, ఇది బీహార్ నుండి దక్షిణ కర్ణాటక వరకు చత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉంది. ఈ నెల 16న తూర్పు భారతం మీదుగా మరో ద్రోణి, దక్షిణాది రాష్ట్రాలపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఈ గాలులు దిశను మార్చి దక్షిణం నుంచి వీచే అవకాశం ఉంది. దీని ప్రభావం 4 రోజుల పాటు ఉంటుంది. ఈ ఎఫెక్ట్‌తో మార్చి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ శనివారం తన బులెటిన్‌లో పేర్కొంది.
మరోవైపు ఏపీలో అక్కడక్కడ క్యుములోనింబస్ మేఘాలు కూడా ఏర్పడే అవకాశం ఉందని, అవి ఏర్పడిన ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా చోట్ల సాధారణం కంటే 2–4 డిగ్రీలు తక్కువగా పగటి ఉష్ణోగ్రతలు (గరిష్టంగా) నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది వాతావరణ శాఖ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Food Grains, Local News, Visakhapatnam