AP Weather Report: ఏపీకి 3 రోజుల వెదర్ రిపోర్ట్... ఈ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం...

ప్రతీకాత్మక చిత్రం

AP Weather forecast | కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో నైఋతి రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉంది.

  • Share this:
    AP Weather Report Today: కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో నైఋతి రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉంది. ఈశాన్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో 1.5 కిమీ నుంచి 3.6 కిమీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైఋతి బంగాళాఖాతం ప్రాంతాలలో 2.1 కి.మీ నుంచి 5.8 కిమీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :
    ఉత్తర కోస్తాంధ్ర, యానాం:
    ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

    దక్షిణ కోస్తా ఆంధ్ర:
    ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

    రాయలసీమ:
    ఈ రోజు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
    First published: