ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మరో ఆరు రోజులు రాష్ట్రంలో సూర్యుడి భగభగలు తప్పవని స్పష్టం చేసింది. ఇప్పటికే నిప్పుల కుంపటిలా ఉన్న రాష్ట్రానికి ఇది మరో పిడుగులాంటి వార్త. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 28 వరకు రాష్ట్రంలోఎండలు ఉంటాయని, ఆ తర్వాత వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. వడగాలులు వీస్తాయని తెలిపారు. 29 నుంచి పిడుగులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు జూన్ 5 నాటికి కేరళను తాకి, కొన్నిరోజులకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు. వడగాలుల తీవ్రత పెరుగుతున్నందున జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Summer, WEATHER