AP WEATHER REPORT IMD PREDICTS 3 DAYS LIGHT TO MODERATE RAINS ACROSS ANDHRA PRADESH SK
AP Weather Report: ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
ప్రతీకాత్మకచిత్రం
ఏపీలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య, ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. తమిళనాడు తీర ప్రాంతానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతం మీద ఉన్న అల్పపీడన ద్రోణి బలహీన పడింది.
చలికాలంలోనూ వానలు వదలడం లేదు. ఏపీలోని పలు ప్రాంతాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఓ వైప చలి.. మరోవైపు వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఐతే మరో మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. IMD తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య, ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. తమిళనాడు తీర ప్రాంతానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతం మీద ఉన్న అల్పపీడన ద్రోణి బలహీన పడింది. వీటి ప్రభావంతో ఏపీలో రాగత మూడు రోజుల పాటు వానలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం :
ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురుస్తాయి. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఇవాళ దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల మరియు అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చు. ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల మరియు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
రాయలసీమ :
ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల మరియు అక్కడక్కడ భారీ వర్షాలు కురవచ్చు. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల మరియు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.