హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Government: ఏపీ ప్రభుత్వం సరికొత్త రికార్డు.. 3.5 కోట్ల అర్జీల పరిష్కారం.. జగన్ ఐడియా సూపర్ సక్సెస్

AP Government: ఏపీ ప్రభుత్వం సరికొత్త రికార్డు.. 3.5 కోట్ల అర్జీల పరిష్కారం.. జగన్ ఐడియా సూపర్ సక్సెస్

సీఎం జగన్(ఫైల్)

సీఎం జగన్(ఫైల్)

ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు, పౌరసేవలను తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను (Village, Ward Secretariates) అమలు చేస్తోంది.

  ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు, పౌరసేవలను తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను (Village, Ward Secretariats) అమలు చేస్తోంది. రాష్ట్రంలో దాదాపు 11,162 గ్రామ సచివాలయాలు, 3842 వార్డు సచివాలయాలు అంటే మొత్తం 15,004 సచివాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సచివాలయ వ్యవస్థ ద్వారా 543 కు పైగా సేవలు 34 శాఖల సమన్వయంతో ప్రజలకు అందిస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 3.54 కోట్ల సేవల కోసం వినతులు అందగా.. వీటిలో 3.52 కోట్ల వరకు సేవలు అందించినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 1.35 లక్షల మంది కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులను, 2.65 లక్షల మంది వాలంటీర్లను అంటే మొత్తం దాదాపు 4 లక్షల మందికి ఒకేసారి ఉద్యోగాలు కల్పించినట్లు ఆయన వెల్లడించారు.

  గ్రామాలు, వార్డుల్లో అందుబాటులో ఉన్న సచివాలయాల్లో ప్రజలకు కావాల్సిన అన్ని సేవలు అందుతున్నాయని.., అన్ని సంక్షేమ పథకాలు, సర్టిఫికెట్లు, కేంద్రం ఇచ్చే ఆధార్, పాస్ పోర్ట్ సేవలు కూడా గ్రామాల్లోనే సచివాలయ వ్యవస్థ ద్వారా కల్పిస్తున్నామని పెద్దిరెడ్డి అన్నారు. అలాగే రిజిస్ట్రేషన్లు కూడా సచివాలయంలో చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నామని తెలిపారు.

  ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ సినిమా అసలు బడ్జెట్ ఇదేనా..? లెక్కలు చెప్పిన ఏపీ మంత్రి..


  సచివాలయాల్లో ప్రభుత్వపరంగా లభించే సేవలను అందించడమే కాకుండా పలు సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు చేరువ చేస్తున్నామని పెద్దిరెడ్డి వెల్లడించారు. జగనన్న తోడు, వైయస్ఆర్ బీమా వంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయని వివరించారు. జగనన్న తోడు కింద ఇప్పటి వరకు మూడు విడతలుగా 14.16 లక్షల మందికి పదివేల రూపాయల చొప్పున రూ.1416.09 కోట్లు ఇచ్చామని., వైయస్ఆర్ బీమా కింద ఎవరైన సహజ మరణం పొందితే ఆ కుటుంబానికి రూ. లక్ష, ప్రమాదం అయితే రూ. అయిదు లక్షలు ఇస్తున్నామని.. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ. 129.90 కోట్లు ఈ పథకం కింద సహజ మరణాలకు ఇచ్చినట్లు తెలిపారు.

  ఇది చదవండి: ఈ ఫోటోలోని ఏపీ రాజకీయ నేతను గుర్తుపట్టగలరా..? తమన్నా పాటకు స్టెప్పులేసిన మాజీ ఎమ్మెల్యే..


  సచివాలయ వ్యవస్థతో మమేకమై పనిచేస్తున్న వాలంటీర్లకు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఏడాది కాలం పూర్తిగా పనిచేస్తే వారికి సేవామిత్ర కింద రూ. 10 వేలు, ఒక సర్టిఫికేట్, బ్యాడ్జీ, శాలువతో సన్మానించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవామిత్ర కింద 2,17,650 మందికి, సేవారత్న కింద 4,010 మందికి రూ.20వేల నగదు, సర్టిఫికేట్, బ్యాడ్జీ, శాలువా, సేవావజ్ర కింద 875 మందిని ఎంపిక చేసి రూ.30 వేల నగదు, సర్టిఫికేట్, బ్యాడ్జీ, శాలువాతో సత్కరించినట్లు మంత్రి తెలిపారు.

  ఇది చదవండి: ఏపీలో వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఆ ఛార్జీల్లో 25శాతం రాయితీ..


  2020-21 లో ఈ మూడు విభాగాల కింద 2.22 లక్షల మందికి రూ.128.27 కోట్ల ఆర్థిక ప్రోత్సాహం అందించామని., రూ. 12.73 కోట్లు మెడల్, శాలువ,సర్టిఫికేట్ల బ్యాడ్జీలు తదితరాల కోసం ఖర్చు చేశామన్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో 2.33 లక్షల మంది వాలంటీర్లకు రూ.258.37 కోట్లు ప్రతిపాదిచామన్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh

  ఉత్తమ కథలు