ఏపీలో పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం.. కొత్తగా 1.5 లక్షల మంది అర్హులు

కొత్త వారితో కలిపి రాష్ట్రంలో మొత్తం పెన్షనర్ల సంఖ్య 59.03 లక్షలకు చేరింది. 2.68 లక్షల మంది వాలంటీర్లు నేరుగా పెన్షనర్ల ఇళ్ళ వద్దకే వెళ్ళి పెన్షన్ సొమ్మును లబ్ధిదారుల చేతికే అందించనున్నారు.

news18-telugu
Updated: June 30, 2020, 9:18 PM IST
ఏపీలో పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం.. కొత్తగా 1.5 లక్షల మంది అర్హులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బుధవారం ఏపీ వ్యాప్తంగా పెన్షన్ పంపిణీకి సర్వం సిద్ధం చేశారు అధికారులు. వైయస్ఆర్ పెన్షన్ కానుక కింద 59.03 లక్షల మందికి పెన్షన్ అందుకోనున్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల చేతికి పెన్షన్ అందించాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జూలై నెల పెన్షన్ చెల్లింపుల కోసం ప్రభుత్వం 1442.21 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు ఈ సొమ్మును జమ చేసింది. వాలంటీర్లు అర్హుల వద్దకే వెళ్లి పింఛన్ డబ్బులను అందించనున్నారు. ఈ నెల నుంచి కొత్తగా 1.5 లక్షల మంది పెన్షన్ తీసుకోనున్నారు.

వీరిలో 5165 మంది హెల్త్ పెన్షనర్లు ఉన్నారు. కొత్త వారితో కలిపి రాష్ట్రంలో మొత్తం పెన్షనర్ల సంఖ్య 59.03 లక్షలకు చేరింది. 2.68 లక్షల మంది వాలంటీర్లు నేరుగా పెన్షనర్ల ఇళ్ళ వద్దకే వెళ్ళి పెన్షన్ సొమ్మును లబ్ధిదారుల చేతికే అందించనున్నారు. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్ కు బదులుగా జియో ట్యాగింగ్ తో కూడిన ఫోటోలను తీసి అప్‌లోడ్ చేస్తారని సెర్ఫ్ సిఇఓ పి.రాజబాబు తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో ఉండిపోయిన 3364 మంది పెన్షనర్ల సొమ్మును వారు తిరిగి వచ్చిన తరువాత చెల్లిస్తామని ఆయన చెప్పారు. అటు జిల్లాల పరిధిలో పెన్షన్ బదిలీ కోసం 18,533 మంది, ఇతర జిల్లాలకు తమ పెన్షన్ బదిలీ చేయాలని 7501 మంది చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి, వారికి కూడా ఆ మేరకు పెన్షన్ బదిలీ ఉత్తర్వులు ఇచ్చినట్లు వెల్లడించారు.

First published: June 30, 2020, 9:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading