• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • AP VIGILANCE OFFICIALS FILED CASES AGAINST PRIVATE HOSPITALS FOR VIOLATING RULES AK

Andhra Pradesh: ఏపీలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులపై కేసులు నమోదు.. ఎక్కడెక్కడంటే..

Andhra Pradesh: ఏపీలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులపై కేసులు నమోదు.. ఎక్కడెక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: రాష్ట్రంలో ఇప్పటివరకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 37 ప్రైవేట్ ఆస్పత్రులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

  • Share this:
    ఏపీలో కరోనా కాటు నుంచి తప్పించుకునేందుకు అనేకమంది ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. కొందరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్స తీసుకుంటుంటే.. మరికొందరు ట్రీట్‌మెంట్ కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పలు ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి. రోగుల నుంచి అధిక డబ్బులు వసూలు చేయడంతో పాటు వారికి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందుకున్న విజిలెన్స్ అధికారులు పలు ఆస్పత్రుల ఆకస్మిక దాడులు జరిపారు. ఈ దాడుల్లో మొత్తం 9 ప్రైవేట్ ఆస్పత్రులపై కేసు నమోదు చేశారు.

    రోగుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఏలూరులోని చైత్ర ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లాలో రోగుల వద్ద నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తుండడంతో ఆశా ఆస్పత్రిపై కేసు నమోదైంది. విశాఖ ఎస్‌ఆర్ హాస్పిటల్, అనిల్‌ నీరుకొండ కూడా కేసులు నమోదయ్యాయి. విశాఖలోని రమ్య ఆస్పత్రి యాజమాన్యం అనుమతులు లేకుండా కోవిడ్ వైద్యం చేస్తున్నారని కేసు నమోదు చేశారు. విజయవాడ శ్రీరామ్ ఆస్పత్రిపైన కేసు నమోదైంది.

    గుంటూరు విశ్వాస్ హాస్పటల్‌ లో అనుమతి లేకుండా వైద్యం చేయడమే కాకుండా అధిక ఫీజు వసూలు చేస్తున్నారు. పీలేరు ప్రసాద్ హాస్పటల్‌ యాజమాన్యం అధిక ఫీజు వసూలు, ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయడం లేదు. ఇలా పలు రకాల కారణంగా ఈ ఆస్పత్రులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ రకంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 37 ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్స్‌ అధికారులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులపై తమ దాడులు కొనసాగుతాయని తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published: