టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా.. విజయవాడలో ధర్నా..

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ చేపట్టిన సమ్మెకు ఏపీకి చెందిన ఆల్ ట్రేడ్ యూనియన్ల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) మద్దతు తెలిపింది. ఈ మేరకు విజయవాడలోని పండిత్ నెహ్రూ బస్టాండ్ ఎదుట ఈ రోజు ఆందోళన చేపట్టింది.

news18-telugu
Updated: October 17, 2019, 1:54 PM IST
టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా.. విజయవాడలో ధర్నా..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 17, 2019, 1:54 PM IST
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ చేపట్టిన సమ్మెకు ఏపీకి చెందిన ఆల్ ట్రేడ్ యూనియన్ల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) మద్దతు తెలిపింది. ఈ మేరకు విజయవాడలోని పండిత్ నెహ్రూ బస్టాండ్ ఎదుట ఈ రోజు ఆందోళన చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన జేఏసీ నేతలు.. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు అలుపెరుగని పోరాటం చేశారని, ఇప్పుడు ఆ కార్మికులే 13 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదా అంటూ మండిపడ్డారు. అహంతో పాలన సాగిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సీఎం కేసీఆర్‌కు హితవు పలికారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే తాము కూడా ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. 19వ తేదీన టీఎస్‌ఆర్టీసీ జేఏసీ చేపట్టిన తెలంగాణ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఇదిలా ఉండగా, తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పలు చోట్ల ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర నిరసన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని, నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అటు.. ఇందిరా పార్కు వద్ద ప్రతిపక్షాలు సామూహిక దీక్ష చేపట్టాయి.

First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...