ఏపీలో టూరిజం మాస్టర్ ప్లాన్... ఆ ఎనిమిది నగరాల్లో...

ఏపీలో టూరిజం అభివృద్ధి కోసం ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: December 17, 2019, 3:42 PM IST
ఏపీలో టూరిజం మాస్టర్ ప్లాన్... ఆ ఎనిమిది నగరాల్లో...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే యోచనలో ఉన్న ప్రభుత్వం... ఇందుకోసం పలు నగరాల్లో స్టార్ హోటళ్లను నిర్మించాలని భావిస్తోంది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో స్టార్ హోటళ్లను నిర్మించాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన పర్యాటన శాఖ... త్వరలోనే ఇందుకోసం టెండర్లను పిలిచేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 ప్రాజెక్టులకు త్వరలోనే టెండర్లను పిలవబోతున్నారు. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో వీటిని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఎనిమిది నగరాల్లో ఇప్పటికే స్టార్ హోటళ్ల నిర్మాణం కోసం దాదాపు 774 ఎకరాల భూమిని కూడా గుర్తించారు.

వీటితోపాటు శ్రీకాకుళం మండలం గార మండలంలో 20 ఎకరాలు, అరకు మండల డింగ్రీపుట్‌లో 12.84 ఎకరాలు, విశాఖలోని మధురవాడలో 340 ఎకరాలు, రిషికొండలో 65 ఎకరాలు, ఆత్రేయపురంలో 56 ఎకరాలు, కాకినాడ రూరల్ తమ్మవరంలో 11.50 ఎకరాలు, విజయవాడలోని భవానీ ఐలాండ్ పరిధిలోని 25 ఎకరాలను ఇందుకోసం గుర్తించారు. వీటితో పాటు కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లా, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది.


First published: December 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు