హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: తగ్గేదే లేదు.. మూడు రాజధానులపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం..

Andhra Pradesh: తగ్గేదే లేదు.. మూడు రాజధానులపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం..

మూడు రాజధానులపై సీఎం జగన్

మూడు రాజధానులపై సీఎం జగన్

AP Three Capitals: రాష్ట్ర రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మూడు రాజధానులపై ఏపీ (AP Three Capitals) రాజకీయాలను మళ్లీ కుదిపేస్తోంది. విశాఖే పరిపాలనా రాజధానిగా ఉంటుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అసెంబ్లీ వేదికగా మరోసారి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. మూడు రాజధానులపై గతంలో ఏపీ హైకోర్టు (AP High Court) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్త దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అమరావతే ఏపీ రాజధాని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్ర రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సర్కార్. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేసింది. శాసన వ్యవస్థను నిర్వీర్యం చేసే హైకోర్టు తీర్పు ఉందని అభిప్రాయపడింది.

  Big Shock to YCP: వైసీపీకి బిగ్ షాక్.. వాలంటీర్లను దూరం పెట్టాలని ఆదేశం

  ఐనప్పటికీ మూడు రాజధానులపై జగన్ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఖచ్చితంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని.. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఉంటుందని అసెంబ్లీ వేదికగా తెగేసి చెప్పారు. అతి త్వరలోనే ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడతామని వైసీపీ నేతలు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచే ఏపీ పరిపాలన జరుగుతుందని చెబుతున్నారు. విశాఖ నగరం (Visakhapatnam)తో పాటు శాసన రాజధానిగా అమరావతి (Amaravati), న్యాయ రాజధానిగా కర్నూలు (Kurnool)ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రతీ ప్రాంతం బాగుపడాలి, ఆ ప్రాంతంలో ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలనేదే తమ తాపత్రయమని.. అందుకోసమే పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.

  మరోవైపు టీడీపీ , బీజేపీ మాత్రం అమరావతి కేంద్రంగా రాష్ట్ర పరిపాలన కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి నారాయణస్వామి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎక్కడ ఉంటే అదే రాష్ట్ర రాజధాని అని తేల్చి చెప్పారు. రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా పనులకు అనుమతులు పొంది, 40 శాతం పనులు పూర్తయ్యాక కాదనడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. అటు అమరావతి పరిరక్షణ సమితి కూడా.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పాదయాత్ర చేస్తోంది. అమరావతి నుంచి శ్రీకాకుళంలో అరసవిల్లి వరకు ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం తగ్గేదే లేదు అన్నట్లుగా.. మూడు రాజధానుపై దూకుడు మీదుంది. త్వరలోనే మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకువాలని భావిస్తోంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Amaravati, Andhra Pradesh, AP News, AP Three Capitals

  ఉత్తమ కథలు