ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వర్రావుకి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఆయన రెండు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు కూడా. దీంతో రెండు రోజులుగా ఆయనను కలిసిన ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో కాస్త రిలాక్స్ గా ఉన్న ఎమ్మెల్యేలకు ఈ విషయం టెన్షన్ పెట్టించింది. అసెంబ్లీ ఆవరణలో ఎక్కడ చూసినా ఈ చర్చే కనిపించింది. ఇదిలా ఉంటే తనకు కరోనా సోకినట్లు తేలడంతో ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే నాగేశ్వర్రావు హాజరు కావడం లేదు. ఆయనను కలిసిన ఎమ్మెల్యేలు సైతం హోం క్వారంటైన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
కరోనాతో మరో ఎంపీ మృతి.. ప్రధాని మోదీ సంతాపం
ఇదిలా ఉంటే.. ఇండియాలో సోమవారం 31,118 కొత్త కరోనా కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 94,62,809కి చేరింది. అలాగే... నిన్న 482 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 41,985కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. నిన్న 41,985 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 88,89,585కి చేరింది. ఇండియాలో రికవరీ రేటు 93.9 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,35,603 ఉన్నాయి. ఇండియాలో నిన్న 962,322 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 14,13,49,298కి చేరింది.
నవంబర్ 17 తర్వాత ఇంత తక్కువగా కొత్త కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. దేశంలో వరుసగా ఐదో రోజు 500 కంటే తక్కువ మరణాలు సంభవించాయి. యాక్టివ్ కేసులు ఏకంగా 11.3వేలు తగ్గాయి. నవంబర్ 17 తర్వాత ఇంత ఎక్కువగా తగ్గడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో కొత్త కేసులు 3.8 వేలు రాగా ఢిల్లీలో 3.7వేలు, కేరళలో 3.4వేలు వచ్చాయి. ఐతే... ఢిల్లీలో నిన్న 108 మంది చనిపోగా... మహారాష్ట్రలో 80 మంది చనిపోయారు. కేరళలో మొత్తం కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. అక్కడ యాక్టివ్ కేసులు 62వేలు ఉన్నాయి. రికవరీ రేటు 89.3 శాతం ఉంది.
Published by:Nikhil Kumar S
First published:December 02, 2020, 12:12 IST