Andhra Pradesh Telangana Weather Today Live: ఏపీలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఐఎండీ అలర్ట్

AP Telangana Weather Today Live: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడనున్నాయి. పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

  • News18 Telugu
  • | August 11, 2022, 09:54 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED 2 MONTHS AGO

    AUTO-REFRESH

    Highlights

    17:1 (IST)

    నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్న మొత్తం 26 గేట్లను ఎత్తారు. వాటిని 10 అడుగుల మేర ఎత్తి దిగువకే నీటిని విడుదల చేస్తున్నారు. అంతకుముందు 2009లో మాత్రమే అన్ని గేట్లను ఎత్తారు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో సాగర్ వద్ద జల దృశ్యం కనువిందు చేస్తోంది.

    16:57 (IST)

    వాయుగుండం క్రమంగా ఏపీకి చేరవవుతోందని ఏపీ వెదర్ మ్యాప్ పేర్కొన్నారు.ఈ ప్రభావం ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్రప్రదేశ్‌లో శనివారం నుంచి మళ్లీ వర్షాలు పడతాయని వెల్లడించారు. వచ్చే వారం కూడా వానల జోరు ఉంటుందని తెలిపారు.

    14:30 (IST)

    ఐఎండీ హైదరాబాద్ తాజా వెదర్ బులెటిన్

    14:29 (IST)

    మహారాష్ట్ర నుంచి తెలంగాణకు పోటెత్తుతున్న వరద

    12:18 (IST)

    తెలుగు రాష్ట్రాల్లో  వర్షాలపై వాతావరణశాఖ ఏం చెబుతోంది..?

    12:5 (IST)

    నాగార్జున సాగర్ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 3.60 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు.

    12:3 (IST)

    తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ మేరకు ఏడు రోజులకు గాను వెదర్ బులెటిన్‌ను విడుదల చేసింది.

    12:1 (IST)

    తెలంగాణలో నమోదైన వర్షపాతం వివరాలు

    11:0 (IST)

    నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తారు. 16 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 2.37 లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 1.88 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కూగా.. ప్రస్తుతం  305 టీఎంసీ నీరుంది. 

    9:30 (IST)


     బంగాళాఖాతంలో రుతుపవనాల ప్రభావం బలంగా ఉంది. కోస్తా తీరంలో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో (AP Telangana Rains) విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూలైలో వచ్చిన వరద విలయాన్ని మరవక ముందే.. ఇప్పుడు మళ్లీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి.  ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వానలు (Weather Updates Today) కురుస్తుండడంతో.. నదులన్నీ మళ్లీ ఉప్పొంగి ప్రవవహిస్తున్నాయి. జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. ప్రాజెక్టులు మళ్లీ గేట్లు తెరచుకుంటున్నాయి.  శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల సహా దాదాపు అన్ని ప్రాజెక్టుల గేట్లు తెరచుకోవడంతో పర్యాటకులు క్యూ కడుతున్నారు.