సీఎం జగన్‌ ఎఫెక్ట్.. తెలంగాణకు క్యూ కట్టిన ఏపీ వ్యాపారులు..

తెలంణాలో మద్యం దుకాణాల టెండర్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం ఏపీ వ్యాపారులకు కలిసి వచ్చింది. దీంతో వారి కన్ను తెలంగాణపై పడింది. దీని వల్ల మద్యం టెండర్లకు అనూహ్య స్పందన వస్తోంది. టెండర్లు వేసేందుకు అక్కడి వ్యాపారులు పోటీపడుతున్నారు.

news18-telugu
Updated: October 16, 2019, 5:09 PM IST
సీఎం జగన్‌ ఎఫెక్ట్.. తెలంగాణకు క్యూ కట్టిన ఏపీ వ్యాపారులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో మద్యం దుకాణాలను ప్రభుత్వ పరం చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడంతో.. అక్కడి మద్యం బాబులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఇదే సమయంలో తెలంణాలో మద్యం దుకాణాల టెండర్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం వారికి కలిసి వచ్చింది. ఇంకేముంది.. వారి కన్ను తెలంగాణపై పడింది. దీంతో మద్యం టెండర్లకు అనూహ్య స్పందన వస్తోంది. టెండర్లు వేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రాకు చెందిన చాలా మంది వ్యాపారులు తెలంగాణలో టెండర్లు వేసేందుకు ముందుకువస్తున్నారు. షాపుల సంఖ్యను కూడా పెంచడం వారికి కలిసి వచ్చింది. స్నేహితులు, బంధువుల ద్వారా మద్యం టెండర్లు వేయిస్తున్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉన్న తమ బంధువుల ద్వారా టెండర్లు దాఖలు చేయిస్తున్నట్లు సమాచారం. అలా ఒకటికి మించి దరఖాస్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది సిండికేట్‌గా ఏర్పడి దరఖాస్తు చేస్తున్నట్లు తెలిసింది.

ఈ మద్యం టెండర్ల వల్ల తెలంగాణ సర్కారుకు ఆదాయం బాగా పెరుగుతోంది. టెండరు దరఖాస్తు ఫీజు రూ. లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచడం వల్ల ఈ ఆదాయం రెట్టింపు అవుతోంది. ఈ రోజు రాత్రి అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరనుంది. ఇదిలా ఉండగా, ఈ నెల 18న లాటరీ పద్ధతిలో టెండర్లను అధికారులు కేటాయించనున్నారు.

కాగా, రాష్ట్రంలో 2,216 మద్య దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. కొత్త మద్యం విధానం 2019 నవంబరు 1 నుంచి 2020 అక్టోబరు 31 వరకు అమల్లో ఉంటుంది. గతంలో ఉన్న 4 శ్లాబులను 6 శ్లాబులుగా మార్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులను నడుపుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉంటాయి.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...