AP STUDY CIRCLE OFFERS FREE COACHING FOR IBPS JOBS THIS IS THE RULES AND CONITIONS NGS
Free Coaching: బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఫ్రీ కోచింగ్.. ఇలా అప్లై చేసుకోండి
బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఫ్రీ కోచింగ్
Free Coaching For Bank Exams: ఏపీలో బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని ఏపీ స్టడీ సర్కిల్ నిర్ణయించింది. అయితే ఈ ఫ్రీ కోచింగ్ పొందడానికి అర్హతలు ఏంటి..? ఎలా కోచింగ్ కోసం అప్లై చేసుకోవాలి..?
Free Coaching For Bank Exams: ఇటీవల బ్యాంకు ఉద్యోగాలకు విపరీతమైన పోటీ పెరిగింది. మంచి వేతనంతో పాటు ఉద్యోగ భద్రత ఉండడంతో ఈ ఉద్యోగాలు సాధించేందుకు అనేక మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కోచింగ్ ల కోసం వేలాది రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాంటి వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. పట్టుదలతో బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నవారికి ఏపీ స్టడీ సర్కిల్ ద్వారా ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నారు. ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సర్వీసెస్(IBPS) పరీక్షల కోసం సిద్ధమవుతున్న బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీ స్టడీ సర్కిల్ కోరింది. ఈ పరీక్షల కోసం సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, అర్హతలు ఉన్న ఇతర అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని ఏపీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ ఫ్రీ కోచింగ్ అడ్మిషన్ కోసం ఆగస్టు 1న ఆన్ లైన్ లో ప్రీ క్వాలిఫయింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు స్టడీ సర్కిల్ ప్రకటించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 22లోపు https://jnanabhumi.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వార్షిక ఆదాయం రూ.6లక్షల లోపు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామంది.
ఇటీవల బ్యాంకు ఉద్యోగాలకు విపరీతమైన పోటీ పెరిగింది. మంచి శాలరీతో పాటు ఉద్యోగ భద్రత ఉండడంతో ఈ జాబ్స్ సాధించేందుకు అనేకమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా, బ్యాంకు ఉద్యోగాల కోచింగ్ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అలాంటి వారికి ఏపీ స్టడీ సర్కిల్ శుభవార్త చెప్పింది. ఐబీపీఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు వెల్లడించింది.
అర్హతలు ఇవే:
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసి ఉండాలి.
ఐబీపీఎస్ నోటిఫికేషన్ ప్రకారం వయస్సు 18 ఏళ్లకు పైగా ఉండాలి.
వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయలు దాటి ఉండకూడదు వార్షికాదాయం ఉండాలి.
ఏదైనా ఉద్యోగం చేస్తున్న వారికి, లేదా చదువువుకుంటున్న వారు దరఖాస్తుకు అనర్హులు.
ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ స్టడీ సర్కిల్ నుంచి ఇంతకు ముందే కోచింగ్ తీసుకున్న వారు అప్లై చేసుకోవడానికి అనర్హులు.
కేవలం ఏపీకి చెందిన అభ్యర్థులు మాత్రమే శిక్షణకు అర్హులు.
IBPS ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న వారు మాత్రమే శిక్షణకు అర్హులు
అప్లై చేసే సమయంలో జాగ్రత్తలు:
దరఖాస్తులో అభ్యర్థుల ఫొటో సరిగా లేకుంటే రిజక్ట్ చేస్తారు.
అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో కమ్యూనిటీ, నేటివిటీ సర్టిఫికేట్, ఇన్ కం సర్టిఫికేట్, టెన్త్ మార్క్స్ మెమో, ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్లు, చివరి విద్యార్హతకు సంబంధించిన టీసీ సర్టిఫికేట్ స్కానింగ్ కాపీని అటాచ్ చేయాల్సి ఉంటుంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.