Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    AP SSC Results 2019 : మరికాసేపట్లో ఏపీ పదో తరగతి ఫలితాలు.. మొబైల్ యాప్‌లో రిజల్ట్స్ ఇలా చూసుకోండి

    AP SSC Results | ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం(మే 14)న విడుదల కానున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ విడుదల చేసేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

    news18-telugu
    Updated: May 14, 2019, 10:49 AM IST
    AP SSC Results 2019 : మరికాసేపట్లో ఏపీ పదో తరగతి ఫలితాలు.. మొబైల్ యాప్‌లో రిజల్ట్స్ ఇలా చూసుకోండి
    తెలంగాణ ఐసెట్ రిజల్ట్స్ రిలీజ్
    • Share this:
    ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఫలితాల విడుదలకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. నిజానికీ పదోతరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఎప్పుడో పూర్తైంది. అయితే, అన్ని వివరాలతో కూడిన ఫలితాలను ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఫలితాలు అనౌన్స్ చేసేందుకే అధికారులు సమయం తీసుకున్నారు. అయితే ఇప్పటికే పాఠశాలల నుంచి ఇంటర్నల్ మార్కులు కూడా వచ్చేశాయి. ఆ మార్కులను అధికారులు అఫిషియల్ వెబ్‌సైట్‌‌లో పొందుపరిచారు.

    ఫలితాల కోసం విద్యాశాఖ పలు ఏర్పాట్లు చేసింది. వివిధ సైట్స్‌లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చని తెలిపింది. ఆర్టీజీఎస్ వెబ్‌సైట్, పీపుల్ ఫస్ట్ మొబైల్ యాప్, ఖైజాలా యాప్, ఫైబర్ నెట్ టీవీ తెరపైనా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని తెలిపింది. విద్యార్థులు ఆర్టీజీఎస్ వెబ్‌సైట్ www.rtgs.ap.gov.in, పీపుల్ ఫస్ట్ మొబైల్ యాప్ https://bit.ly/2E1cdN7, ఖైజాలా యాప్ https://aka.ms/apresult ద్వారా తెలుసుకోవచ్చని, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) వెబ్‌సైట్‌ www.rtgs.ap.gov.inలో ముందుగా విద్యార్థి నెంబర్ టైప్ చేయగానే రిజల్ట్స్ వస్తాయని తెలిపింది.

    ఇప్పటికే ఏపీ ఎస్‌ఎస్‌సి రిజల్ట్స్ కోసం 6.2 లక్షల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఏపీలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 3 వరకు పదోతరగతి పరీక్షలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,839 పరీక్షాకేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు . 6.2 లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు.

    రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి..



    ఇవి కూడా చదవండి..

    Govt Jobs : Vizag Steel‌లో మేనేజ్‌మెంట్‌లో జాబ్స్... పూర్తి వివరాలు
    Published by: Sulthana Begum Shaik
    First published: May 14, 2019, 10:47 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading