ఏపీలో టెన్త్ పరీక్ష షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు

ఏపీలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు.

news18-telugu
Updated: December 3, 2019, 7:24 PM IST
ఏపీలో టెన్త్ పరీక్ష షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సారి నుంచి టెన్త్ పరీక్షల్లో కీలక మార్పులు తీసుకొస్తోంది ఏపీ ప్రభుత్వం. 20 శాతం ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను రద్దు చేశారు. ఇకపై ప్రశ్నాపత్రంలోనే బిట్ పేపర్ ఉంటుంది. పశ్రాపత్రంలో సబ్జెక్టుల వారీగా పాస్ మార్కులను కేటాయిస్తారు. పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పొడిగించి రెండున్నర గంటలు చేశారు. విద్యార్థులు పశ్రాపత్రాన్ని చదువుకునేందుకు ఈ అదనపు సమయం ఉపయోగపడనుంది. ఆన్సర్ షీట్‌ను కూడా నాణ్యంగా తయారు చేస్తామని.. పదో తరగతి పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ఇది వరకే చెప్పారు.First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>