విభజన సమయంలో రాజధాని కోల్పోన ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్ల ప్రత్యేక హోదా(Special Status) ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం(Parliamentary standing committee on commerce) సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులో విభజన సమయంలో రాజధాని కోల్పోయిన ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు హోదా కల్పించాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఈ నివేదికను వీడియోకాన్ఫరెన్స్(Video Conference) ద్వారా రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడికి సంఘం అందించింది.
స్థాయీ సంఘం పలు అంశాలను ఉదహరిస్తూ ఈ సిఫార్సును పంపింది. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్ రాష్ట్రం ప్రత్యేకస్థాయితో పాటు, ప్రత్యేక కేటగిరీ హోదాను అనుభవించింది.. ప్రస్తుతం ఆర్టికల్ 370, 35-ఏలను రద్దు చేసి జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టడం వల్ల ఆ రాష్ట్రానికి ఇక ఏ మాత్రం ప్రత్యేక కేటగిరీ హోదా కొనసాగే అవకాశం లేదు. అయితే 2021-22 కేంద్ర బడ్జెట్లో జమ్మూ కశ్మీర్‌కు రూ.1.08 లక్షల కోట్లు, లడఖ్‌కు రూ.5,958 కోట్లు కేటాయించినట్లు స్థాయీ సంఘం గమనించింది.
భారీ కేటాయింపుల వల్ల ఈ ప్రాంతాల్లో తగినంత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఇది ఆహ్వానించదగ్గ అంశమే అని పేర్కొంది. రాజధానిని కోల్పోయిన లడఖ్‌కు ఎదురయ్యే ప్రతికూలతలను పూడ్చడానికి వీలవుతుంది. కొత్తగా ఏర్పడిన జమ్మూ కశ్మీర్(Jammu & Kashmir), లడఖ్‌లకు ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో కేంద్రం అధిక కేటాయింపులు చేయడాన్ని కమిటీ అభినందించింది.జమ్ము కాశ్మీర్‌కు చేసిన విధంగానే రాష్ట్ర విభజన సమయంలో రాజధానులను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్(Chhattisgarh), ఝార్ఖండ్‌లకూ పరిహారం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కమిటీ సిఫార్సులో పేర్కొంది.
రాజధాని కోల్పోయిన ఈ మూడు రాష్ట్రాలకు కనీసం పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ప్రకటిస్తే.. ఆయా రాష్ట్రాల వాణిజ్యం, ఎగుమతుల మౌలిక వసతుల పరంగా ఆర్థికాభివృద్ధి చెందడానికి వీలవుతుంది’’ అని కమిటీ పేర్కొంది. గుంటూరులో మిరప కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి.
దేశంలో మిరప ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా ఉన్న గుంటూరు(Guntur)లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. గుంటూరులో ప్రతి నెలా 1.8 లక్షల టన్నుల మిరప ఎగుమతులు అవుతుందని సంఘం పేర్కొంది. ప్రస్తుతం గుంటురులో సాధారణ గోదాములు ఉన్నాయని వాటి బదులుగా కోల్డ్ స్టోరేజ్ సదుపాయం కల్పించేందుకు కేంద్ర, వాణిజ్య ఆహార శుద్ధి శాఖ చర్యలు తీసుకోవాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. అంతే కాకుండా కొత్తగా ఏర్పటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి వాల్తేరు డివిజన్‌ను విడగొట్దని స్థాయీ సంఘం సిఫార్సు చేసింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.