AP SPECIAL ENFORCEMENT BUREAU TAKING SERIOUS ACTION ON ILLICIT LIQUOR MAFIA FULL DETAILS HERE PRN
AP Police: అక్రమ మద్యంపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. రెండు వారాల్లో 3వేల కేసులు..
ఏపీలో భారీగా నాటుసారా ధ్వంసం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం అక్రమ మద్యం, నాటు సారా మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసందే. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో దాడులు ముమ్మరం చేసింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం అక్రమ మద్యం (Illicit liquor), నాటు సారా మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసందే. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో దాడులు ముమ్మరం చేసింది. అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి రవాణా వంటి నేరాలకు పాల్పడుతున్నవారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 16 రోజులుగా అంటే మార్చి 10 నుండి 26వ తేదీ వరకు ఆపరేషన్ పరివర్తన్ 2.0 లో భాగంగా నాటు సారా స్థావరాల పైన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధ్వర్యంలో దాడులను కొనసాగిస్తోంది. అందులో భాగంగా నాటుసారా తయారీకి అవకాశం ఉన్న అన్నీ ప్రాంతాలలో సెబ్ అధికారులు, స్థానిక పోలీసులు, ఏపిఎస్పి బృందలు ముమ్మరగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
16 రోజుల పాటు ఏకదాటిగా దాడులు నిర్వహించిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు రాష్ట్ర వ్యాపంతా మొత్తం 3,403 కేసులు నమోదు చేశారు. ఇందులో మొత్తం 2,066 మందిని అరెస్ట్ చేశారు. 44,058 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని, 155 వాహనాలు సీజ్ చేశారు. అలాగే సారా తయారీకి ఉపయోగించే 16,04,741 లీటర్ల పులియబెట్టిన బెల్లపు ఊట ద్వంసం చేశారు. 73,734 కేజీల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో వ్యాప్తంగా కేవలం వారం రోజుల్లో నలుగురిపై పిడీ యాక్ట్ ప్రయోగించిననట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బుర్యో ప్రకటించింది.
రాష్ట్ర వ్యాప్తంగా తరచుగా నాటుసారా తయారీ కి పాల్పడుతున్న వారిపైన ఉక్కుపాదం మోపుతున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తెలిపింది. 2020 అక్టోబర్ నుండి ఇప్పటివరకు వరకు రాష్ట్రంలో సెబ్ కమిషనర్ పర్యవేక్షణలోని అధికారుల బృందం స్థానిక పోలీసులు, ఎక్సైజ్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో నాటుసారా స్థావరాలపైన నిరంతరయంగా దాడులు జరుపుతూ వాటిని పూర్తిగా ద్వంసం చేస్తూ సంబందిత నిర్వహకులపైన కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించింది. సెబ్ కఠిన చర్యలు తీసుకుంటున్నా కొంతమంది నిర్వాహకులు అదే పనిగా నాటుసారా తయారీకి పాల్పడుతున్నారని పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా వారిని గుర్తించి అనేకసార్లు వారికి నాటుసారా తయారీ, విక్రయాలపట్ల సంభవించే దుష్పరిణమాలను వివరిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడం, అదే వృత్తిగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని సెబ్ స్పష్టం చేసింది. అలాంటి వారిని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి 17 మందిపైన పిడీ యాక్ట్ కేసులు నమోదు చేసినట్లు వివరించింది. జిల్లాల వారీగా 2020 నుండి ఇప్పటివరకు 17 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసినట్లు సెబ్ వెల్లడించింది. వీటిలో చిత్తూరు జిల్లాలో 04, కృష్ణా జిల్లాలో 03, గుంటూరు జిల్లాలో 03, పశ్చిమ గోదావరిలో 05, అనంతపురం జిల్లాలో 02 కేసులు నమోదు చేసింది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.