శాసనమండలిపై ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఆర్డీయే రద్దు బిల్లుతో పాటు రాజధాని వికేంద్రీకరణ బిల్లును మరోసారి ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.

news18-telugu
Updated: June 23, 2020, 4:09 PM IST
శాసనమండలిపై ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు
తమ్మినేని సీితారాం(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనమండలి కేవలం సలహాలిచ్చేందుకే అని ఆయన అన్నారు. శాసనసభలో తీసుకునే నిర్ణయాలే ఫైనల్ అని వ్యాఖ్యానించారు. శాసనసభకు సర్వఅధికారులు ఉన్నాయని తమ్మినేని సీతారం తెలిపారు. మండలి, సీఆర్డీయే రద్దు బిల్లుపై కోర్టుకెళ్లనివ్వండని ఆయన అన్నారు. టీడీపీ కోర్టుకెళ్లినా భూమి బద్ధలై, ఆకాశం విరిగిపడలేదు కదా ? అని అన్నారు. టీడీపీ నాయకులు అవివేకంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఆర్డీయే రద్దు బిల్లుతో పాటు రాజధాని వికేంద్రీకరణ బిల్లును మరోసారి ఏపీ అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ఏపీ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. దీంతో సీఆర్డీయే రద్దు బిల్లుతో పాటు రాజధాని వికేంద్రీకరణ బిల్లు పరిస్థితి ఏమిటన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.




First published: June 23, 2020, 4:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading