విశాఖకు వెళ్లిది అప్పుడే... సచివాలయ ఉద్యోగులకు యూనియన్ క్లారిటీ...

అమరావతి నుంచి సెక్రటేరియట్ తరలింపుపై మే నెల చివరి నాటికి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు.

news18-telugu
Updated: March 18, 2020, 2:24 PM IST
విశాఖకు వెళ్లిది అప్పుడే... సచివాలయ ఉద్యోగులకు యూనియన్ క్లారిటీ...
ఏపీ సచివాలయం (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నుంచి సచివాలయ తరలింపు ఎప్పుడు ఉంటుందనే అంశంపై ప్రజలతో పాటు ఉద్యోగుల్లో కూడా పలు సందేహాలు ఉన్నాయి. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు క్లారిటీ ఇచ్చారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... రాజధాని మార్పు ఎప్పుడు ఉంటుందని సచివాలయ ఉద్యోగులు యూనియన్‌ను అడుగుతున్నారని, సెక్రటేరియట్ తరలింపుపై ఏ క్షణమైనా ఉత్తర్వులు రావొచ్చని ప్రకటించారు. ఎప్పుడు ఆర్డర్స్ వచ్చినా వెళ్లేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని స్పష్టటం చేశారు. మే చివరిలోగా ఉత్తర్వులు రావొచ్చని వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. అలాగే, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, తరువాత జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి పూర్తి వివరాలు చెబుతామన్నారు.

విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్కడికి సెక్రటేరియట్‌ను తరలించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఏదేమైనా తరలింపు మాత్రం ఆగే ప్రసక్తే లేదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.  ఇదే సమయంలో ఉద్యోగుల్లో కూడా పలు సందేహాలు, అనుమానాలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి ఉద్యోగులు అమరావతి తరలివచ్చారు. అమరావతి, చుట్టుపక్కల ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యారు. ఈ క్రమంలో మరోమారు విశాఖకు తరలింపు అనేసరికి కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే, విశాఖకు తరలించిన తర్వాత ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. వారి వారి కేడర్‌కు తగినట్టు ఇళ్లు కట్టుకోవడానికి నామమాత్రపు ధరకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పింది.

మరోవైపు విద్యార్థులకు పరీక్షలు జరిగే సమయంలో సచివాలయం తరలిస్తే ఇబ్బందులు పడతామనే అంశాన్ని కూడా ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వారి విజ్ఞప్తిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు పూర్తయిన తర్వాతే తరలించాలని భావిస్తోంది. మే నెలాఖరు అంటే అన్ని రకాల పరీక్షలు పూర్తి అవుతాయి. అలాగే, మే నెలాఖరులో వెళితే జూన్‌లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి, విశాఖలో కొత్త స్కూళ్లు, కాలేజీల్లో తమ పిల్లలను చేర్చుకునే వెసులుబాటు కూడా కలుగుతుంది. అందుకే ప్రభుత్వం మే నెలాఖరు నాటికి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు యూనియన్లకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

First published: March 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading