AP SEC NIMMAGADDA RAMESH KUMAR LETTER TO CS ADITYANATH DAS REGARDING CASTE CERTIFICATES TO CONTESTANTS AND OTHER ISSUES AK
Andhra Pradesh: వైసీపీకి మరో షాక్.. వారి దూకుడుకు నిమ్మగడ్డ బ్రేక్.. ఏపీ సీఎస్‌కు మరో లేఖ
ఆదిత్యానాథ్ దాస్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)
Andhra Pradesh: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా ఆటంకాలు కలిగిస్తున్నారని పలు రాజకీయ పార్టీలు ఎస్ఈసీ దృష్టికి తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
మంత్రులు, సలహాదారులు ప్రభుత్వ వాహనాల వినియోగంపై ఆంక్షలు ఉంటాయని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని లేఖలో పేర్కొన్నారు. మంత్రులు గ్రామాలకు వెళ్లే సమయంలో అధికారులు హాజరుకాకూడదని ఆదేశించారు. ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదని ఎస్ఈసీ స్పష్టం చేసింది. నోటిఫికేషన్ జారీ అయిన రోజు నుంచి.. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని చెప్పారు. కేబినెట్ ర్యాంక్‌లో ఉన్న ప్రభుత్వ సలహాదారులు, పార్టీ కార్యాలయాల్లో ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడకూడదని ఎస్ఈసీ పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సమయంలో ప్రభుత్వ వాహనాలను ఉపయోగించొద్దని ఎస్ఈసీ ఆదేశించారు.
ఇక అభ్యర్థులు సమర్పించే కుల ధృవీకరణ పత్రాలపై ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో పాత కుల ధృవీకరణ పత్రాలను అనుమతించాలని ఆదేశించింది. కొత్త ధృవీకరణ పత్రాలు కావాలని ఒత్తిడి చేయకూడదని పేర్కొంది. కొత్త సర్టిఫికెట్ల సమర్పణకు నిర్ణీత సమయం ఇవ్వాలని అధికారులకు సూచించింది. పోటీ చేసేవారికి ఫాస్ట్‌ట్రాక్ విధానంలో కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఎస్ఈసీ వెల్లడించింది. దీంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బకాయిలు చెల్లింపునకు వస్తే వెంటనే తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా ఆటంకాలు కలిగిస్తున్నారని పలు రాజకీయ పార్టీలు ఎస్ఈసీ దృష్టికి తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు కోడ్ వర్తిస్తుందన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల పర్యటనల్లో ఉద్యోగులు పాల్గొనరాదన్న నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
\
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.