ఏపీ ఇసుక వెబ్‌సైట్ హ్యాక్.. బ్లూ ఫ్రాగ్ ఆఫీసులో సీఐడీ సోదాలు

ఏపీ ఇసుక వెబ్‌సైట్ హ్యాక్.. బ్లూ ఫ్రాగ్ ఆఫీసులో సీఐడీ సోదాలు

ప్రతీకాత్మక చిత్రం

కంపెనీ సర్వర్లలో డేటాను తనిఖీ చేసి పలు ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంత ఇసుకను బ్లాక్ చేశారు? ఎవరికి ఆర్థిక ప్రయోజనాలు అందాయి? ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లింది? అనే దానిపై ఆరా తీస్తోంది.

  • Share this:
    ఏపీలో ఇసుక కొరతపై దుమారం రేగుతోంది. ఇసుక దొరక్క భవన నిర్మాణ రంగం కుదేలయింది. చేతిలో పనిలేక భవన నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారు. ఐతే ఇన్నాళ్లు వరదలతో నదులు ఉప్పొంగడం వల్లే ఇసుక లభించలేదని.. అందుకే కొరత ఏర్పడిందని ప్రభుత్వం చెబుతోంది. ఐతే ఇసుక కొరత వెనక కొందరు కేటుగాళ్లు ఉన్నట్లు సంచలన విషయం వెలుగులకి వచ్చింది. ఏపీ ప్రభుత్వ ఇసుక వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి కృతిమ కొరత సృష్టించినట్లు తెలుస్తోంది. బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ అనే సంస్థ ఈ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిందని సమాచారం.

    బ్లూ ఫ్రాగ్‌ సంస్థ‌కు చెందిన పలువురు వ్యక్తులు సైట్‌ను హ్యాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించినట్లు సీఐడీకి ఫిర్యాదు అందాయి. దాంతో రంగంలోకి దిగిన సీఐడీ విశాఖలో ఉన్న బ్లూ ఫ్రాగ్స్ కార్యాలయంలో సోదాలు చేసింది. స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. సర్వర్‌ని హ్యాక్ చేసి కోడ్ ద్వారా ఇసుక అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. కంపెనీ సర్వర్లలో డేటాను తనిఖీ చేసి పలు ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంత ఇసుకను బ్లాక్ చేశారు? ఎవరికి ఆర్థిక ప్రయోజనాలు అందాయి? ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లింది? అనే దానిపై ఆరా తీస్తోంది.

    ఏపీలో కొత్త ఇసుక విధానానాన్ని అమల్లోకి తెచ్చిన సీఎం జగన్.. మన శాండ్ పోర్టల్ ప్రారంభించారు. దాని ద్వారా ప్రజలు ఆన్‌లైన్‌లో ఇసుక కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. అందుకోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్‌ను రూపొందించారు. ఆ పోర్టల్‌ను బ్లా ఫ్రాగ్స్ సంస్థే నిర్వహిస్తోంది. ఐతే సంస్థకు చెందిన కొందరు ఉద్యోగులు సైట్‌ను హ్యాక్ చేసి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీని వెనక ఎవరున్నారని తేల్చే పనిలో ఉంది సీఐడీ. కాగా, ఏపీలో ఇసుక రవాణాలో అక్రమాలకు పాల్పడితే రూ. 2 లక్షల జరిమానాతో రెండేళ్ల జైలు విధించాలని ఇవాళ కేబినెట్ నిర్ణయించింది.


    First published: