ఏపీలో లారీ ఇసుక రూ.80 వేలు.. పెచ్చరిల్లుతున్న మాఫియా..

ప్రతీకాత్మక చిత్రం

గాజువాక ఆటోనగర్‌లో ఇసుక మాఫియా ఎక్కువైంది. ఒక్క లారీ లోడు రూ.80 వేల వరకు అమ్ముతున్నారు. రోజుకు 10 నుంచి 15 లారీల వరకు ఒడిసా సహా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

  • Share this:
    ఏపీలో ఇసుక మాఫియా భారీగా పెరిగిపోయింది. గత నాలుగు నెలలుగా ఇసుక కొరత ఏర్పడటంతో ఇదే అదనుగా భావించి వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు.ఇసుక దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. భవన నిర్మాణాలను చేపట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. కొరతపై ఇప్పటికే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఒకరినొకరు దూషించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇసుక దందాను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటూ జోరుగా, దర్జాగా దోపిడీ చేస్తున్నారు కొందరు. తాజాగా, గాజువాక ఆటోనగర్‌లో ఇసుక మాఫియా ఎక్కువైంది. ఒక్క లారీ లోడు రూ.80 వేల వరకు అమ్ముతున్నారు. రోజుకు 10 నుంచి 15 లారీల వరకు ఒడిసా సహా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, మాఫియా గురించి తెలిసినా అధికారులు ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ కొందరు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

    ఇదిలా ఉండగా, కృష్ణా, గోదావరి, పెన్నా నదులకు వరదలు ఎక్కువవడంతో ఇసుకను తీయలేని పరిస్థితి ఏర్పడిందని.. వరదలు తగ్గాక పారదర్శకంగా అందరికి ఇసుక అందజేస్తామని అధికారులు, మంత్రులు చెబుతున్నారు.

    Published by:Shravan Kumar Bommakanti
    First published: