కోడెల శివప్రసాద్ ఫ్యామిలీకి మరో షాక్

కోడెల శివ ప్రసాద్(ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికిల్ చట్టం-1989లోని రూల్ 84 కింద గౌతం‌ఆటోమోటివ్ డీలర్‌షిప్ రద్దుచేశామని అధికారులు స్పష్టంచేశారు.

  • Share this:
    ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబానికి మరో షాక్ తగిలింది. కోడెల కుమారుడు కోడెల శివరామకృష్ణకు చెందిన గౌతం ఆటోమోటివ్స్ లైసెన్సు, ఆర్టీఏ రద్దుచేసింది. గౌతం ఆటోమోటివ్స్‌కి వాహలనాల సరఫరా నిలిచేలా డీలర్‌షిప్ కూడా రద్దు చేశారు. షోరూమ్ సీజ్ చేయడం‌ అక్రమమంటూ ఇప్పటికే కోర్టుకెక్కారు శివరామకృష్ణ. ఐతే RTA చట్టాలను ఉల్లంఘిస్తూ 576 వాహనాలను అక్రమంగా కొనుగోలుదారులకు అమ్మారని విచారణలో తేల్చారు ఆర్టీఐ అధికారులు. ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికిల్ చట్టం-1989లోని రూల్ 84 కింద గౌతం‌ఆటోమోటివ్ డీలర్‌షిప్ రద్దుచేశామని అధికారులు స్పష్టంచేశారు. కాగా, అసెంబ్లీ ఫర్నిచర్‌ని చోరీచేశారని కోడెలపై ఆరోణలున్న సంగతి తెలిసిందే.

    Published by:Shiva Kumar Addula
    First published: