ఏపీలో 11, తెలంగాణలో 45కు పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు...

news18-telugu
Updated: March 26, 2020, 10:14 PM IST
ఏపీలో 11, తెలంగాణలో 45కు పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు మెల్లమెల్లగా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విజయవాడకు చెందిన యువకుడికి కరోనా ఉన్నట్టు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన యువకుడికి కరోనా లక్షణాలు ఉండడంతో అతడికి పరీక్షలు నిర్వహించగా, రిపోర్టుల్లో పాజిటివ్ వచ్చింది. ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14కు చేరింది. ఈ రోజు కొత్తగా నలుగురికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, అందులో ఒకరు ఇప్పటికే ట్రీట్‌మెంట్ తీసుకుని కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం 44 పాజిటివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌ శివారు కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. బాధితుడు ఈనెల 14న హైదరాబాద్ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వెళ్లాడు. అక్కడి నుంచి 17న తిరిగి ఢిల్లీ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ చేరుకున్నాడు. 18వ తేదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో తన కుమారుడితో కలసి ఇంటికి వెళ్లాడు. అదే రోజు జలుబు చేయడంతో కుత్బుల్లాపూర్లో ఓ వైద్యుడిని సంప్రదించాడు. అయినా జలుబు తగ్గకపోవడంతో ఈనెల 25న స్వయంగా గాంధీ ఆస్పత్రికి వచ్చి వైద్యులను కలిశాడు. అదే రోజు పరీక్షలు నిర్వహించగా, ఈరోజు రిపోర్టుల్లో పాజిటివ్ వచ్చింది.

ఇక హైదరాబాద్‌ దోమలగూడకు చెందిన 41 సంవత్సరాల డాక్టర్, 36 సంవత్సరాల మహిళా డాక్టర్ (ఇద్దరూ భార్యాభర్తలు) కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ డాక్టర్‌కు తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో తల్లికి కరోనా నెగిటివ్ వచ్చింది. తండ్రి, ఇద్దరు పిల్లల రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ డాక్టర్ భర్త కూడా ఈనెల 17న తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఓ డాక్టర్‌ను కలిసి తిరిగివచ్చాడు. ఒంట్లో బాగోకపోవడంతో ఈనెల 20న యశోద ఆస్పత్రికి వెళ్లాడు. 21వ తేదీన కరోనా లక్షణాలు కనిపించాయి. 24వ తేదీన పరీక్షలు నిర్వహించగా, ఈ రోజు రిపోర్టుల్లో పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన సికింద్రాబాద్ బుద్ధనగర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా వచ్చింది.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు