దేవిరెడ్డి శ్రీనాథ్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం కేబినెట్ హోదా...

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం కొవరంగట్టుపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డికి జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం ఉంది.

news18-telugu
Updated: February 16, 2020, 8:39 PM IST
దేవిరెడ్డి శ్రీనాథ్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం కేబినెట్ హోదా...
సీఎం జగన్, ఏపీ మ్యాప్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీనియర్ జర్నలిస్ట్ అయిన దేవిరెడ్డి శ్రీనాథ్‌‌ను జగన్ ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమించింది. ఇప్పుడు ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ జీఓ జారీ చేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం కొవరంగట్టుపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డికి జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. శ్రీనాథ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు.

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి (File)


జర్నలిస్టులపై సీఎం జగన్‌కు అపార గౌరవం ఉందని.. ఆయనలోనూ ఓ జర్నలిస్టు ఉన్నారని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో నకిలీ వార్తలు ప్రమాదకరంగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేసిన శ్రీనాథ్‌రెడ్డి... జర్నలిస్టులు తమ ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకోవలసిన అవసరం ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంత విలేకరుల సమస్యలను పరిష్కరించటానికి కృషి చేస్తానని ఆయన ప్రమాణస్వీకార సందర్భంగా హామీ ఇచ్చారు.

First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు