AP POWER MINISTER BALINENI SRINIVASA REDDY ASSURES ELECTRICITY TARIFFS WILL NOT BE INCREASED SU
ఎన్ని ఇబ్బందులున్నా విద్యుత్ చార్జీలు పెంచం.. ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(ఫైల్ ఫొటో)
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలపై భారం వేయమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచబోమని మంత్రి తెలిపారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలపై భారం వేయమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచబోమని మంత్రి తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్ఈసీఎం) కొత్త లోగోను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని తెలిపిన వివరాలను చంద్రశేఖరరెడ్డి మీడియాకు వివరించారు. కోవిడ్ సంక్షోభంతో విద్యుత్ సంస్థలు మరింతగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. అయినప్పటికీ ఆ భారాన్ని ప్రజలపై పడనివ్వకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.
ఇందులో భాగంగానే విద్యుత్ పంపిణీ సంస్థలు చార్జీల పెంపు ప్రతిపాదన లేకుండానే వార్షిక ఆదాయ అవసర నివేదికలను ఏపీఈఆర్సీకి సమర్పించాయని వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిస్కంలను ఆదుకుందని మంత్రి పేర్కొన్నారు. 2019–20లో రూ.17,904 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.8,353.58 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్ సరఫరా కోసం రూ.717.39 కోట్లు సబ్సిడీ కేటాయించిందన్నారు. చౌక విద్యుత్ లక్ష్య సాధన కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి నూతన విధానాలను అధ్యయనం చేయాలని విద్యుత్ సంస్థలకు మంత్రి సూచించారు.
ఇక, కొద్దిరోజుల కిందట మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జెన్కో విద్యుత్ ప్లాంట్లను అమ్మేస్తున్నారనేది కేవలం కొంతమంది పనిగట్టుకుని చేసే దుష్ప్రచారమేనన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.