ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు నాలుగు రోజులుగా విద్యుత్ కోతలు (AP Power Cuts) పెరిగాయి. గ్రామాలు మాత్రమే కాదు.. పట్టణాల్లో కూడా కరెంట్ ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఎండలకు బయటకు వెళ్లలేక.. ఇంట్లో ఉక్కపోతను భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు, వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from Home) చేస్తున్న ఉద్యోగుల కష్టాలు మామూలుగా లేవు. గంటల తరబడి కరెంట్ పోతోందని.. ఎప్పడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొందని ఏపీ ప్రజలు వాపోతున్నారు. సెల్ఫోన్ల లైట్ల వెలుగుల్లో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. పరిశ్రమలకు పవర్ హాలీడే (Power Holiday for Industries) ప్రకటించడంతో పారిశ్రామిక వర్గాలు సైతం ఇబ్బంది పడుతున్నాయి. వీకెండ్‌తో పాటు మరో రోజు అదనంగా సెలవు ప్రకటించాలని 24గంటలూ నడిచే పరిశ్రమలు కూడా 50శాతం విద్యుత్ వినియోగించుకోవాలని ఆదేశించింది.
ఏపీలో విద్యుత్ కోతలపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. #ByeByeYSJagan హ్యాష్ ట్యాగ్ నిన్న మధ్యాహ్నం నుంచీ ట్విటర్లో ఉంది. ఫన్నీ మీమ్స్‌తో ఏపీ సర్కార్‌పై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూద్దాం.
YS JAGAN MARK DARK GOVERNANCE#ByeByeYSJagan#YSJaganMarkGovernancepic.twitter.com/C8Qeb18aII
— భరత్ అనే నేను ?✍️ (@BharathAneNenu) April 8, 2022
#ByeByeYSJagan #ByeByeYSJagan ??????? U silly people ? pic.twitter.com/arlAfHkc8u
— Sekhar? (@SomaSiddhu) April 8, 2022
Power Cuts In AP ?#ByeByeYSJagan pic.twitter.com/Noe2aAq6gE
— Twood Trends™ (@TrendsTwood) April 7, 2022
View this post on InstagramView this post on Instagram
This one?????????#ByeByeYSJagan#YSJaganDarkGovernance pic.twitter.com/6sWdfAIzjl
— ѶᏋຖӄค₮ ? (@megacpr_only) April 8, 2022
View this post on Instagram
View this post on Instagram
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు తాత్కాలికమేనని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. గృహ, వ్యవసాయ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ పేర్కొన్నారు. ఈ తాత్కాలిక ఇబ్బందులు కూడా ఏప్రిల్ నెల చివరి వరకు మాత్రమే ఉంటాయని.. తరువాత పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Power cuts, Ys jagan