హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మోదీ వైజాగ్ టూర్‌ను భుజానికెత్తుకున్న జగన్.. ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టేందుకేనా..?

మోదీ వైజాగ్ టూర్‌ను భుజానికెత్తుకున్న జగన్.. ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టేందుకేనా..?

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

గడచిన్న కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. ఇన్నాళ్ళూ వైసీపీ (YSRCP)- బీజేపీ (BJP) ల మధ్య ఉన్న తెరచాటు స్నేహం ప్రధాని మోదీ (PM Modi) విశాఖ పర్యటన సందర్భంగా బట్టబయలైనట్లే కనిపిస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh | Visakhapatnam

Anna Raghu, Sr. Correspondent, News18, Amaravati

గడచిన్న కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. ఇన్నాళ్ళూ వైసీపీ (YSRCP)- బీజేపీ (BJP) ల మధ్య ఉన్న తెరచాటు స్నేహం ప్రధాని మోదీ (PM Modi) విశాఖ పర్యటన సందర్భంగా బట్టబయలైనట్లే కనిపిస్తోంది. మోదీ పర్యటనకు వైసీపీ నేతలు చేస్తున్న హంగామా చూస్తుంటే ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమా లేక వైసీపీ కార్యక్రమమా అని ప్రజలు అనుకునేలా ఉంది పరిస్థితి. మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) విశాఖ పర్యటన తర్వాత ఏపీలో పొత్తుల రాజకీయాలు మరింత రంజుగా మారాయి. పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనను వైసీపీ ప్రభుత్వం అడ్డుకొవడమే గాక ఆయన్ను బలవంతంగా అక్కడి నుంచి పంపేసింది. దీంతో ఆగ్రహించిన పవన్ అధికార పార్టీ నాయకులపై తీవ్రమైన పదజాలంతో విరుచుకు పడ్డారు. అంతటితో ఆగకుండా వైసీపీకి ఈ సారి అధికారం దక్కనివ్వను అంటూ ఛాలెంజ్ కూడా చేశారు. అదే అదునుగా అప్పటివరకు పవన్‌కు దూరంగా ఉన్న చంద్రబాబు నాయుడు సానుభూతి పేరుతో విజయవాడ వచ్చి మరీ పవన్ కల్యాణ్‌ని పరామర్శించి కొత్త పొత్తులకు తెరలేపారు. దీంతో వచ్చే ఎన్నికలలో జనసేన-టీడీపీ పొత్తుపై రాజకీయ వర్గాలలో ఉన్న అనుమానాలు చాలా వరకు పటాపంచలైపోయాయి.

జనసేనతో టీడీపీ కలిస్తే తమకు జరిగే నష్టంపై అటు వైసీపీ ఇటు బీజేపీ రెండు పార్టీలు ఒక అంచనాకి వచ్చాయి. ఇన్నాళ్ళూ పవన్ తమతోనే ఉంటాడని బలంగా విశ్వసించిన బీజేపీ ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళింది. టీడీపీతో పొత్తు విషయంలో వేచి చూసే ధోరణిని అవలంభించమని బీజేపీ పెద్దలు పవన్‌కు ఉచిత సలహా ఇచ్చారట.

ఇది చదవండి: ఏపీలో పొలిటికల్ సినిమాలు..! ఏకంగా ఆరు సినిమాలకు ప్లాన్..! టైటిల్స్ ఇవే..!

ఇక వైసీపీ మాత్రం టీడీపీ-జనసేనతో తమకు నష్టం తప్పదని భావిస్తోంది. ఈ రెండు పార్టీలకు బీజేపీ తోడైతే 2014 ఫలితం పునరావృతం అయ్యేఅవకాశం లేకపోలేదు. దీనికితోడు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కూడా తోడైతే తమపరిస్థితి ఏంటనేది వైసీపీ నాయకత్వం లోలోపల మధన పడుతున్నారట. అందుకే బీజేపీని పవన్‌కి దూరం చేస్తూనే ఇటు చంద్రబాబుకు దగ్గరకాకుండా ఉంచేలా స్కెచ్ వేసిందని.. అన్ని విధాలా కమలంతో అంటకాగితే టీడీపీ-జనసేన కలయికతో కలిగే నష్టాన్ని కొంతమేరైనా తగ్గించుకోవచ్చనేది వైసీపీ ఆలోచనగా ఉంది.

ఏది ఏమైనా మోదీ విశాఖ పర్యటన సందర్భంగా రాష్ట్ర బీజేపీ వర్గాలే ఆశ్ఛర్యపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఇప్పటికే ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలతో ఉత్తరాంధ్రలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న బీజేపీ వల్ల భవిష్యత్తులో వైసీపీ ఎంతమేర లబ్ధిపొందుతుందో చూడాలి..!!

First published:

Tags: Andhra Pradesh, AP Politics, Ysrcp