Home /News /andhra-pradesh /

AP POLITICS YSRCP TO CELEBRATE PLENARY ON JULY 8TH AND 9TH AS MP VIJAYASAI REDDY GIVES INSTRUCTIONS TO PARTY MLAS AND LEADERS FULL DETAILS HERE PRN GNT

YCP Plenary: వైసీపీ ప్లీనరీకి ముహూర్తం ఫిక్స్.. 2024 ఎన్నికలే టార్గెట్.. జగన్ వ్యూహం ఇదేనా..!

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

మార్చి నెలలో జనసేన (Janasena Party) ఆవిర్భావం సభ జరగ్గా.. మే నెలలో టీడీపీ (TDP) మహానాడు (Mahanadu) ముగిసింది. ఇప్పుడు అధికార వైసీపీ (YSRCP) ప్లీనరీ సంబరాలకు సిద్ధమవుతోంది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు వివిధ కార్యక్రమాలతో జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే పార్టీకి సబంధించిన కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నాయి. మార్చి నెలలో జనసేన (Janasena Party) ఆవిర్భావం సభ జరగ్గా.. మే నెలలో టీడీపీ (TDP) మహానాడు (Mahanadu) ముగిసింది. ఇప్పుడు అధికార వైసీపీ (YSRCP) ప్లీనరీ సంబరాలకు సిద్ధమవుతోంది. జులై 8,9వ తేదీల్లో ప్లీనరీ నిర్వహించాలనవి వైసీపీ నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాట్లను కూడా ప్రారంభించింది. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలు ఏర్పాట్లపై చర్చించారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy).. ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జులు, జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు.

  వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని సందర్భంగా జులై 8,9 తేదీలలో గుంటూరు-విజయవాడ నగరాల మధ్యలో ప్లీనరీ నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారని సాయిరెడ్డి తెలిపారు. పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నామని ఆయన అన్నారు. ప్లీనరీకి సంబంధించి పార్టీ నేతలు, కార్యకర్తలకు, అతిధులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్లీనరీ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసారు. ప్లీనరీ జులై 8వ తేదీన ప్రారంభమై 9వ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుందని అన్నారు. పార్టీ నేతలందరూ ప్లీనరీకి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.

  ఇది చదవండి: ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహం.. గోదావరి గర్జనకు సిద్ధం..


  రెండేళ్లలో రానున్న ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలన్నదే సీఎం జగన్ ఉద్దేశమని విజయసాయి రెడ్డి తెలిపారు. పార్టీ నేతలకు సంబంధించి ఎక్కడైనా చిన్నపాటి విభేదాలున్నప్పటికి వాటిని పక్కనపెట్టి ఐకమత్యంగా ముందుకు నడవాలన్నారు. వైసీపీలో వర్గాలకు చోటే లేదని.. గ్రూపు రాజకీయాలు చేసేవారిపై చర్యలు తప్పవని.. ఈ విషయాన్ని పార్టీలోని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేసారు.

  ఇది చదవండి: విశాఖపై టీడీపీ కీలక నిర్ణయం..? ప్లేస్ మారనున్న బాలయ్య చిన్నల్లుడు..?


  పార్టీ గ్రామ, మండల, జిల్లా, రాష్ర్ట కమిటీలకు సంబంధించి పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే వారికి స్ధానం కల్పిస్తామని విజయసాయి రెడ్డి తెలిపారు, అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ పాటించడంతోపాటు ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీలకు తగిన విధంగా ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలన్నారు.

  ఇది చదవండి: ఏపీలో వాళ్లకే బీపీ ఎక్కువ.. సర్వేలో షాకింగ్ నిజాలు


  జిల్లా అధ్యక్షులు కూడా పార్టీ కమిటీలకు సంబంధించి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో సమావేశమై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవాలని, అనంతరం కమిటీల నిర్మాణాన్ని చూసుకోవాలన్నారు. నూతన కమిటీల నియామక ప్రకటన అనేది పార్టీ ప్లీనరీలో జరుగుతుందని వివరించారు. బూత్ కమిటీలకి సంబంధించి కూడా సచివాలయాల సందర్శన కార్యక్రమం అనంతరం పేర్లను పంపాలని విజయసాయి సూచించారు.

  ఇది చదవండి: ఏపీలో అవినీతి పరులకు హెచ్చరిక.. ఇకపై యాప్ లోనే కంప్లైట్ చేయవచ్చు..


  ఇక గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అద్భుతమైన ప్రజా స్పందన లభిస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు. సంక్షేమ పధకాలు అందుకుంటున్న లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారనే విషయం రాష్ర్టంలో ప్రతి ఒక్కరికి అర్ధమైందని అభిప్రాయపడ్డారు. ఐతే ప్లీనరీలో వైసీపీ ఎలాంటి తీర్మానాలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics, Ysrcp

  తదుపరి వార్తలు