త్వరలోనే ఏపీ నుంచి పరిపాలన సాగుతుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పడంతో.. ఇప్పుడు అందరి చూపు విశాఖపై నెలకొంది. ఇప్పటికే ఏప్రిల్ నుంచి విశాఖ(Visakhapatnam) రాజధానిగా పరిపాలన సాగుతుందని వైసీపీ(Ysrcp) మంత్రులు, ముఖ్యనేతలు చెప్పినా.. తాజాగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో.. విశాఖ నుంచి పరిపాలన మొదలయ్యే సమయం దగ్గరపడిందనే విషయంలో క్లారిటీ వచ్చింది. దీంతో అక్కడ సీఎం నివాసం, సెక్రటేరియట్ వంటి ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ అంశంపై వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) స్పష్టత ఇచ్చారు. భీమిలి రోడ్డులోని భవనాలనే సెక్రటేరియట్‌గా వాడుకుంటామని ఆయన తెలిపారు. కోర్టు వివాదాలను పరిష్కరించుకుంటామని చెప్పారు. విశాఖ వస్తే సీఎం ఎక్కడ ఉంటారనేది సమస్య కాదని ఆయన వ్యాఖ్యానించారు. అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని.. భీమిలి రోడ్డులోని ఖాళీగా ఉన్న ఐటీ కంపెనీలను ప్రభుత్వ భవనాలుగా వినియోగిస్తామని చెప్పారు. ఉడాకు సంబంధించిన భవనాలు కూడా ఖాళీగా ఉన్నాయని..ఏప్రిల్‌లోపే విశాఖ నుంచి పాలన కొనసాగుతుందని వివరించారు. ఈలోపు న్యాయపరమైన సమస్యలు పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతకుముందు ఢిల్లీలో ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ ఏపీ రాజధానిగా మారబోతుంది. నేను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతానని జగన్ వ్యాఖ్యానించారు. ఇక విశాఖ కేంద్రంగానే రాష్ట్ర కార్యకలాపాలు జరగనున్నాయని చెప్పారు. సీఎం ఆఫీస్ కూడా విశాఖలోనే ఉండబోతున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మార్చి 3,4వ తేదీల్లో విశాఖలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ సమావేశానికి భారీగా పెట్టుబడిదారులు రావాలని జగన్ కోరారు.
ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టడానికి మీ సహకారం కూడా కావాలని జగన్ చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని జగన్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ గడిచిన మూడేళ్లలో నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం జగన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు.
Big Breaking: ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
Big News: టీడీపీ నుంచి పోటీ..కలకలం రేపుతున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో
సింగిల్ డెస్క్ సిస్టం ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. 11.43 శాతం వృధ్దిరేటుతో దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీనని జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఆరు పోర్టులు కార్యాలకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే మూడు కారిడార్లున్నాయి. ఏపీకి సుదీర్ఘ చరిత్ర ఉందని జగన్ వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.