హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Raghurama: ఆ పదాన్ని సరిగ్గా పలికితే తప్పుకుంటా.. సీఎంకు రఘురామ సవాల్..! సంక్రాంతి వస్తానన్న రాజుగారు

Raghurama: ఆ పదాన్ని సరిగ్గా పలికితే తప్పుకుంటా.. సీఎంకు రఘురామ సవాల్..! సంక్రాంతి వస్తానన్న రాజుగారు

రఘురామకృష్ణంరాజు (ఫైల్)

రఘురామకృష్ణంరాజు (ఫైల్)

వైసీపీ (YCP) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnam Raju) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత వేటు వేయిస్తామంటూ వైసీపీ నేతలు చేసిన ప్రకటనలపై ఆయన స్పందించారు. అంతేకాదు సీఎం జగన్ (AP CM YS Jagan) తో పాటు తన వైసీపీ ఎంపీలకు సవాల్ విసిరారు.

ఇంకా చదవండి ...

  వైసీపీ (YCP) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnam Raju) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత వేటు వేయిస్తామంటూ వైసీపీ నేతలు చేసిన ప్రకటనలపై ఆయన స్పందించారు. అంతేకాదు సీఎం జగన్ (AP CM YS Jagan) తో పాటు తన వైసీపీ ఎంపీలకు సవాల్ విసిరారు. అనర్హత అనే పదాన్ని సీఎం జగన్ పదిసార్లు సరిగ్గా పలికితే తాను అనర్హత పడినట్లే భావిస్తానంటూ ఛాలెంజ్ చేశారు. తాను రాజీనామా చేసి నర్సాపురంలో పోటీ చేసి గెలుస్తానని.. తాను గెలిస్తే సీఎం జగన్ రాజీనామా చేసి భారతి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, సజ్జల రామకృష్ణరెడ్డిలో ఒకరికి సీఎం పదవి ఇస్తే ప్రజలకు కాస్తైనా ఉపశమనం లభిస్తుందన్నారు. ఒకవేళ నరసాపురంలో ఓడిపోతే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.

  తనపై అనర్హత వేటు వేసేందుకు వైసీపీ ఎంపీలు నానా ప్రయత్నాలు చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. తాను ధైర్యంగా రాజీనామా చేసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. వాళ్ల చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఫిబ్రవరి 5వ తేదీ లోగా సీఎం ఆయన వెనకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలను వెంటేసుకొని ప్రధాని, హోంమంత్రి, స్పీకర్ ను కలిసి తనపై అనర్హత వేటు వేయించాలని సవాల్ విసిరారు. తనపై వేటు వేయించకపోతే మీకు ధైర్యం లేదని, చేతగాదని భావించాల్సి వస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  ఇది చదవండి: ఏపీలో నైట్ కర్ఫ్యూ విధింపు.. కొత్త టైమింగ్స్, రూల్స్ ఇవే..!


  భీమవరంలో సంక్రాంతి

  సంక్రాంతి సందర్భంగా ఈనెల 13వ తేదిన ఉదయం నర్సాపురం వెళ్తున్నట్లు రఘురామ ప్రకటించారు. ఏకాదశి ముహూర్తం చూసుకొని మరీ తన నియోజకవర్గానికి వెళ్తున్నానన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా భీమవరం వెళ్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు అక్కడే ఉంటానని తెలిపారు. సంక్రాంతి టూర్ సందర్భంగా ఎవరితోనూ మాట్లాడనని.. తన ప్రతికదలికను వీడియో తీయిస్తానని చెప్పారు. ఈనెల 16వ తేదిన తిరిగి ఢిల్లీ వస్తానని తెలిపారు.

  ఇది చదవండి: శ్రీవారి దర్శనానికి కొత్త విధానం.. టీటీడీ ఆలోచన వర్కవుట్ అవుతుందా..?


  ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విక్రయిస్తున్న మద్యంలో ప్రమాదకర రసాయనాలున్నాయని ఆరోపించారు. దీనికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ ను చేరాల్సిన చోటుకు చేర్చానని ఆయన తెలిపారు. కేవలం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఇలా చేస్తున్నాన్నారు. సీఎం జగన్ తనకు విధించిన అరణ్యవాస శిక్షను రాష్ట్ర ప్రజల కోసమే వినియోగిస్తున్నానన్నారు. ప్రజల కోసం తాను ఉన్నానని స్పష్టం చేశారు. 10వ తేదీ వచ్చినా 50శాతం మందికి పెన్షన్లు, 30శాతం మందికి జీతాలే రాలేదని రఘురామ ఆరోపించారు. ఇలాంటి పాలన కూడా ఒక పాలనేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరోగ్య దోపిడీ, ఆర్ధిక దోపిడీ కూడా జరుగుతోందన్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, MP raghurama krishnam raju

  ఉత్తమ కథలు