M Bala Krishna, News18, Hyderabad
రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnam Raju). ఈ పేరు గురించి పెద్దగా పరియచం చేయనవసరం లేదు. అధికార పార్టీలో ఉంటూనే ప్రతిపక్ష నేతలు కూడా విమర్శంచలేనంతగా తన పార్టీ అధినేతపై విమర్శల వర్షం కురిపిస్తూ ఉంటారు. వైసీపీ ఎంపీగా కాకుండా వైసీపీ రెబల్ ఎంపీగానే ఈయనకు చాలా క్రేజ్. రోజూ ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలకు సంబంధించిన సమాచారాన్ని చెబుతూ ఉంటారు రఘురామకృష్ణంరాజు. సీఎం జగన్ కు పక్కలో బల్లెంగా మారిన ఈ రెబల్ ఎంపీ ప్రస్తుతం రూట్ మార్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనేదానిపై ఒక క్లారీటీకి వచ్చారని అంటున్నారు ఆయన సన్నిహితులు.
ప్రభుత్వం ముందస్తుకు వెళ్లుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో ఏడాదిలో ఎన్నికలు ఉండబోతున్నాయి. మళ్లీ తాను గతంలో పోటీ చేసిన స్థానం నుంచే బరిలో దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు రఘురామ కృష్ణంరాజు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న రఘురామ ఇప్పటికే తాను చేరబోయే పార్టీ దగ్గర కూడా కన్మఫర్మేషన్ తీసుకున్నట్లు సమాచారం.
మరో వైపు వచ్చే ఎన్నికల సమయానికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే అవకాశం ఉందనే వార్తలు నేపథ్యంలో ఈ మూడు పార్టీల్లో ఒక పార్టీలో చేరడానికి ఇప్పటికే ఈయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి పోటీ చేస్తే ఇప్పటికే బాబు తన వెనుక ఉండి టీడీపీతో రహాస్య ఒప్పందంలో భాగంగా రఘురామకృష్ణంరాజు సొంత పార్టీపైనే విమర్శలు చేస్తోన్నారనే ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తోన్నారు. ఒక వెళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తే వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజం అవుతాయనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో మిగిలిన రెండు పార్టీలు బీజేపీ, జనసేనలో ఒక పార్టీని ఆయన సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో బిజేపీ పార్టీ నుంచి జనసేన, టీడీపీ మద్దతుతో బరిలో దిగాలని ఈ రెబల్ ఎంపీ భావిస్తున్నట్లు సమాచారం. మరో వైపు గత కొద్ది రోజులుగా ఆయన నిర్వహిస్తో్న్న ప్రెస్ మీట్ లు కూడా ప్రచారాన్ని బలపరుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రఘురామకృష్ణంరాజు ప్రెస్ మీట్ సమయంలో యాన కూర్చొన్న కుర్చి వెనక ఒక కషాయ కండువా కనిపిస్తోంది. ఇప్పుడు అందరు ఈ కండువా వెనుక ఉన్న కథేంటనేదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రఘురామకృష్ణంరాజు ఏ పని చేసిన ఆలోచనించకుండ చేయరు అయితే తాను బీజేపీలోకి వెళ్లబోతున్నట్లు ముందుగానే తన పార్టీ నేతలకు ఇండికేషన్ ఇవ్వడానికే ఈ ప్లాన్ వేశారా అనే చర్చ జరుగుతుంది. ఏది ఎమైనా ఇప్పుడు రఘురామకృష్ణంరాజు కుర్చీ వెనుక ఉన్న కండువా కథేంటనే చర్చ పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bjp, MP raghurama krishnam raju, Ysrcp