Home /News /andhra-pradesh /

AP POLITICS YSRCP PRESIDENT YS JAGAN MOHAN REDDY SUSPENDS EX MINISTER KOTTAPALLI SUBBARAYUDU FROM PARTY AK GNT

AP Politics: సీఎం జగన్ కీలక నిర్ణయం.. పార్టీ నుంచి మాజీమంత్రి సస్పెండ్

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

Kottapalli Subbarayudu: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిపై సస్పెన్షన్ వేటు వేశారు.

    ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడును సస్పెండ్ చేశారు. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తపల్లి సుబ్బారాయుడిపై వైసీపీ(Ysrcp) నాయకత్వం సస్పెన్షన్ వేటు వేయడంతో.. ఆయన ఏ పార్టీలో చేరతారో అనే ఆసక్తి నెలకొంది. ఇక నిన్న కొత్తపల్లి సుబ్బారాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్ననని అన్నారు. అది ఎక్కడి నుండో..ఏ పార్టీ నుండో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ఒకవేళ ఎవరూ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గవ్యాప్తంగా త‌న‌కు మంచి ప‌ట్టు ఉంద‌ని చెప్పిన సుబ్బారాయుడు.. న‌ర‌సాపురం(Narsapuram) నుంచి పోటీ చేయ‌డం ఖాయమని… ఏ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తాన‌న్న విష‌యాన్ని మాత్రం ఇప్పుడే చెప్ప‌బోనంటూ వ్యాఖ్యానించారు. అన్ని కులాల్లో త‌న‌కు ప‌డే ఓట్లు ఉన్నాయ‌ని ధీమాగా చెప్పారు. అంతేకాదు తాను ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత ఉన్న స‌మ‌యంలోనూ నర్సాపురం నుంచి సొంతంగా గెలిచాన‌ని చెప్పుకొచ్చారు.

    నర్సాపురం స్థానం నుంచి 1983 నుంచి 2014 వ‌ర‌కు పోటీ చేసిన విషయాన్ని సుబ్బారాయుడు గుర్తు చేశారు. ఒక్క 2019 ఎన్నికల్లో మాత్ర‌మే తాను పోటీ చేయ‌లేద‌ని అన్నారు. అలాగే నర్సాపురం జిల్లా కేంద్రం కోసం జరిగిన ఉద్యమంలో తనపై ఏ1గా కేసు నమోదు చేయడంపై సుబ్బారాయుడు స్పందించారు. 41 నోటీసు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని.. ఇటీవల గన్‌మెన్లను తొలగించడంపై స్పందించేందుకు నిరాకరించారు.

    గతంలో అసెంబ్లీ, లోక్ స‌భ స‌భ్యుడిగా టీడీపీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించారు. ఒకే ఒక్క‌సారి మాత్రం కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా ప‌నిచేసింది కూడా టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలోనే. ఉమ్మ‌డి ఏపీ కేబినెట్‌లో గృహ నిర్మాణ శాఖ‌తో పాటు కీల‌కమైన విద్యుత్ శాఖ మంత్రిగా సుబ్బారాయుడు (Kottapalli Subbarayudu) ప‌నిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన సుబ్బారాయుడు ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాల‌య్యారు. ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయ్యాక‌.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన సుబ్బారాయుడు 2014లో వైసీపీలో చేరారు. ఆ తర్వాత‌ తిరిగి టీడీపీలోకి వ‌చ్చిన సుబ్బారాయుడు కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం ఆయ‌న వైసీపీలోనే కొన‌సాగుతున్నా… కొంతకాలంగా ఆయన సొంత పార్టీపైనే ఆరోపణలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది.

    ACB App in AP: ఏపీలో అవినీతి పరులకు హెచ్చరిక.. ఇకపై యాప్ లోనే కంప్లైట్ చేయవచ్చు..

    AP BJP: ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహం.. గోదావరి గర్జనకు సిద్ధం..

    కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తనను తాను చెప్పుతో కొట్టుకోవడం సంచలనం సృష్టించింది. నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చేస్తున్న ఉద్యమానికి స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు దూరంగా ఉండటంపై ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆయన గెలుపు కోసం సహకరించి తప్పుచేశానని తనను తాను చెప్పుతో కొట్టుకుంటున్నానని అన్నారు. అప్పటి నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడిని లైట్ తీసుకుంటూ వచ్చిన వైసీపీ అధినాయకత్వం.. చివరికి ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు