హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: మూడు రాజధానులపై జగన్ సరికొత్త ప్లాన్ ?.. అమరావతి రైతుల పాదయాత్రకు కౌంటర్ ?

YS Jagan: మూడు రాజధానులపై జగన్ సరికొత్త ప్లాన్ ?.. అమరావతి రైతుల పాదయాత్రకు కౌంటర్ ?

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

AP Politics: అమరావతి రైతుల పాదయాత్రను టీడీపీ స్పాన్సర్‌ చేస్తున్న పాదయాత్రగా వైసీపీ పదే పదే ఆరోపిస్తోంది. పాదయాత్ర చేస్తున్న రైతుల్లో టీడీపీ కార్యకర్తలే ఎక్కువ అని విమర్శలు గుప్పిస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఏపీలో మూడు రాజధానులే తమ విధానమని వైసీపీ ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తోంది. ఈ విషయంలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. తాము అనుకున్నది చేసి తీరుతామని తెలిపింది. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. తమ ప్రయత్నాలను అడ్డుకోలేవని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే మూడు రాజధానుల విషయంలో తమ విధానాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు విపక్షాల వాదన తప్పు అని తెలియజేసేందుకు నేరుగా జనంలోకి వెళ్లాలని వైసీపీ (Ysrcp) ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఇందుకోసం మూడు ప్రాంతాల్లో ఈ అజెండాతోనే బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని వైసీపీ అధినేత భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి వైసీపీ నాయకత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు కూడా చర్చ జరుగుతోంది.

  ఏపీలో మూడు రాజధానుల(Three Capitals) ఏర్పాటు కారణంగా జరిగే లాభాలేంటి ? అనే అంశంపై సమగ్ర వివరణతో ఈ సభలు నిర్వహించడం ద్వారా.. మూడు రాజధానుల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీకి చెక్ చెప్పొచ్చనే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగానే కర్నూలు లేదా తిరుపతి , విజయవాడ లేదా గుంటూరు , విశాఖపట్నంలో ఈ సభలను ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విశాఖ నుంచి త్వరలోనే పరిపాలన కొనసాగిస్తామని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తాము విశాఖ నుంచి పరిపాలన కొనసాగించడానికి ముందే ఈ మూడు బహిరంగ సభలను ఏర్పాటు చేయాలనే ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

  ఈ మేరకు ఇప్పటికే పార్టీ నేతలకు సంకేతాలు కూడా ఇచ్చినట్టు టాక్. ఈ సభలను సక్సెస్ చేయడం ద్వారా ఏపీలోని మూడు ప్రాంతాల ప్రజలు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సానుకూలంగా ఉన్నారనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని.. అందుకే వీటిని గొప్పగా నిర్వహించాలని భావిస్తున్నారని సమాచారం. ఒకరకంగా అమరావతి రైతుల పాదయాత్రకు ఈ మూడు భారీ బహిరంగ సభలు కౌంటర్‌గా ఉండబోతున్నాయనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది.

  CM Jagan: రేపు నంద్యాలకు సీఎం జగన్.. మరో ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం.. కానీ అధికారుల్లో టెన్షన్ టెన్షన్.. ఎందుకంటే?

  Rain Alert : మూడు రోజులు భారీ వర్షాలు

  అమరావతి రైతుల పాదయాత్రను టీడీపీ స్పాన్సర్‌ చేస్తున్న పాదయాత్రగా వైసీపీ పదే పదే ఆరోపిస్తోంది. పాదయాత్ర చేస్తున్న రైతుల్లో టీడీపీ కార్యకర్తలే ఎక్కువ అని విమర్శలు గుప్పిస్తోంది. అయితే అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోకుండా వారికి తమదైన స్టయిల్లో కౌంటర్ ఇవ్వాలని యోచిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. ఇందుకోసం భారీ బహిరంగ సభలు నిర్వహించడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మూడు రాజధానులపై వైసీపీ మదిలో ఉన్న కొత్త ప్లాన్ అమలు ఉంటుందా ? లేక మరో కొత్త వ్యూహం తెరపైకి వస్తుందా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు