హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: వైసీపీకి గుడ్ బై చెప్పనున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..?

AP Politics: వైసీపీకి గుడ్ బై చెప్పనున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..?

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Kotamreddy Sridhar Reddy: వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని కార్యకర్తలతో వ్యాఖ్యానించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను పోటీ చేయబోనని అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వైసీపీ అధినాయకత్వం, ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కార్యకర్తలు, అనుచరులతో విడివిడిగా సమావేశమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy).. వారి దగ్గర తన అభిమతాన్ని, ఆవేదనను వెల్లడించినట్టు సమాచారం. వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని కార్యకర్తలతో వ్యాఖ్యానించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను పోటీ చేయబోనని అన్నారు. తమ్ముడికి పోటీగా తాను నిలబడనని చెప్పారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతానని అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని.. దీంతో తన మనోభావాలు దెబ్బతిన్నాయని కార్యకర్తలతో చెప్పుకొచ్చారు. అనుమానం ఉన్న చోట కొనసాగడం కష్టమని అన్నారు.

నిన్న తనపై ఇంటెలిజెన్స్‌ అధికారులు నిఘా పెట్టారని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మూడు నెలల నుంచి తన ఫోన్‌ ట్యాప్‌(Phone Tapping) చేస్తున్నారని వెల్లడించారు. ఈ విషయం తనకు ముందే తెలుసని, రహస్యాలు మాట్లాడుకునేందుకు మరో ఫోన్‌ ఉందని, 12 సిమ్‌ లు కూడా ఉన్నాయని తెలిపారు. ఫేస్‌ టైమర్‌, టెలిగ్రాం కాల్స్‌ను మీ పెగాసస్‌ రికార్డు చేయలేదని... అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా ? అని అన్నారు. నిఘా కోసం నా నియోజకవర్గంలో ఒక ఐపీఎస్‌ అధికారిని ఏర్పాటు చేసుకోండని వ్యాఖ్యానించారు. క్రికెట్‌ బెట్టింగ్‌(Cricket Betting) కేసులప్పుడు కూడా ఒక ఎస్పీ నాపై నిఘా పెట్టారని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.

ఓ వైపు పార్టీ అధినాయకత్వం తీరుపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మరోవైపు కోటంరెడ్డి తీరుపై వైసీపీ నాయకత్వం చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తనకు మంత్రి పదవి రాకపోవడంపై ఆయన తీవ్ర మనస్థాపం చెందారనే వాదన నెల్లూరు జిల్లా రాజకీయవర్గాల్లో ఉంది. తనను కాదని సీఎం జగన్ కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి లభించడంపై ఆయన లోలోపల అసహనంతో ఉన్నారనే టాక్ ఉంది. అప్పటి నుంచే ఆయన పార్టీ లైన్‌కు భిన్నంగా వెళుతున్నారనే టాక్ ఉంది.

Jagananna Chedodu : జగనన్న చేదోడు..నేడే లబ్దిదారుల అకౌంట్లోకి రూ. 10వేలు

Tirumala: ఏపీలో ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు.. !

మరోవైపు వైసీపీ నాయకత్వం కూడా ఈ విషయంలో కోటంరెడ్డి తీరుపై అసంతృప్తితో ఉంది. ఈ నెల మొదట్లోనే ఆయనను పిలిపించుకుని మాట్లాడారు సీఎం జగన్. పద్ధతి మార్చుకోవాలని కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. కానీ కోటంరెడ్డి మాత్రం తన దారి తనదే అన్నట్టుగా సాగిపోవాలని నిర్ణయించుకున్నారని నెల్లూరు జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీకి దూరమవ్వాలని నిర్ణయించుకున్న కోటంరెడ్డి.. ఏ పార్టీ వైపు చూస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

First published:

Tags: Andhra Pradesh, Kotamreddy sridhar reddy, Ysrcp

ఉత్తమ కథలు