Breaking News: తనను ఇరిటేట్ చేస్తే.. ఛానెల్ మాత్రమే కాదు.. పేపర్ కూడా పెడతా.. మీ సంగతి తేలుస్తా అంటూ.. ఆ ఇద్దరికీ వైసీపీ (YCP) రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) సవాల్ విసిరారు.. ఇంతకీ ఆయన కోపానికి కారణం ఏంటి..? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికారి వైఎస్ఆర్సీపీ (YSRCP) కి ఓ ఛానెల్, పేపర్ రెండూ ఉన్నాయి.. ఎవరు కాదన్న అవునన్నా.. అందులో వచ్చేది విజయసాయి రెడ్డి వాయిస్సే ఉంటుంది. మరి అలాంటప్పుడు విజయసాయి రెడ్డి మళ్లీ కొత్తగా ఛానెల్, పేపర్ ఎందుకు పెడతాను అంటున్నారు అసలు ఏమైంది. తాజాగా విశాఖపట్నం (Visakhapatnam)లో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో ఓ ప్రధాన పత్రికపైనా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పైనా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కుట్రలు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని పత్రికలు కులాన్ని ఇంకుగా మార్చుకుని.. వైసీపీ పైనా.. తనపైనా
తప్పుడు రాతలు రాస్తున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల పిచ్చితో నీచపు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. వైసీపీపై టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి అన్నారు. విశాఖను రాజధాని కాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక దసపల్లా భూముల విషయంలో బిల్డర్లు, యాజమానులు క్లారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. సుప్రీం తీర్పును అమలు చేసిన ఘనత మా ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది అన్నారు. మొత్తం 64 ప్లాట్లలో 55 ప్లాట్లు చంద్రబాబు సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్నారు. కానీ ప్రభుత్వ చర్యతో 400 కుటుంబాలకు మేలు జరిగిందని.. అందుకే ప్రతిపక్ష.. ఓ వర్గం మీడియా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
ఇదీ చదవండి : తెరపైకి యునైడెట్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రా.. ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్
విశాఖలో 70 నుంచి 75 శాతం భూములు.. ఒక సామాజిక వర్గం చేతిలోనే ఉండడం దారుణమన్నారు. విశాఖలో ఆస్తులు చంద్రబాబు సామాజిక వర్గం చేతిలో ఉంటే.. జనాభా పరంగా అధికంగా వేరే కులస్థులు ఉన్నారని.. ప్రైవేట్ భూమిని 22A నుంచి తీసేస్తే తప్పేంటీ..? అని ఆయన ప్రశ్నించారు. అసత్యాలు ప్రసారం చేస్తుండడంతోనే కుల పత్రికలపై ఉమ్ము వేసే పరిస్థితి వచ్చింది న్నారు. తన ఆస్తులపై సీబీఐ, ఈడీ, ఎఫ్బీఐ విచారణకు తాను సిద్దంగా ఉన్నాను అన్నారు. మరి చంద్రబాబు నాయుడు.. ఆ పత్రికాధిపతి సిద్దమా అని సవాల్ విసిరారు. .?
ఇదీ చదవండి: సైజుతో సంబంధం లేకుండా సెగలు పుట్టిస్తోంది..? బంగారంతో పోటీ పడుతున్న పులస
చంద్రబాబు సామాజిక వర్గం ఆస్తులు విశాఖలో ఉండాలి.. అమరావతిలో ఆస్తులు ఉండాలి.. ఇదేనా మీ ధ్యేయం అని ప్రశ్నించారు.. మీకు పత్రిక, టీవీ ఉందనే కదా ఇదంతా చేస్తున్నారు.. అయితే ఇకపై తాను మీడియా రంగంలోకి వస్తున్నాను అన్నారు. తన సొంత డబ్బులతో మీడియా పెడతా..చూసుకుందాం రండీ అంటూ ఛాలెంట్ చేశారు విజయసాయి రెడ్డి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Vijayasai reddy