టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) పై వైసీపీ (YSRCP) ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaysai reddy) ఫైర్ అయ్యారు. తెలుగుదేశం ఒక కులపార్టీ అని ఎద్దేవా చేసిన ఆయన.. యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమైందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి (Tiripati) లోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలంలో ఏర్పాటు చేసిన వైసీపీ మెగా జాబ్ మేళ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ వాళ్ళ కులస్తులకే ఉద్యోగాలు కల్పించేవారని ఆరోపించారు. టీడీపీ హయాంలో వారి సామాజిక వర్గంకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు అనేది అందరికి తెలుసన్నారు. అందుకే ప్రజలు టీడీపీకి బుడ్డి చెప్పి వైసీపీకి అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం రాబోయే కాలంలో మరిన్ని అవకాశాలు, రాష్ట్ర తలసరి ఆదాయం ఎలా పెంచాలి అనేది ఆలోచిస్తుందని పేర్కొన్నారు.
నవరత్నాలు రూపంలో ప్రజలకు అన్ని పధకాలు అమలు చేశామని సాయిరెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో బూతులు,పిచ్చి మాటలు మాట్లాడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేసారు. చంద్రబాబు తన హయాంలో ఏ పధకంమైన పూర్తి చేసారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి నష్టం చేకూర్చే గానీ లాభం చేకూర్చలేదని ఆరోపించారు. సొంత పుత్రుడిని నమ్ముకుని రాబోయే ఎన్నికల్లోకి దిగగలరా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనపై నమ్మకం లేదని.. ఆయన 14 ఏళ్ళ చరిత్ర,40 ఏళ్ళ ఇండస్ట్రీ నమ్ముకుని ఎందుకు ఒంటరిగా సిద్దం కాలేకపోతున్నారని ప్రశ్నించారు.
వైసీపీ ఎప్పుడూ ఒంటరిగానే చేస్తుందని.. తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని విజయసాయి స్పష్టం చేసారు. దివంగత వైఎస్ఆర్ కుమారుడు జగన్ ప్రయోజకుడు అయ్యాడనే సంతృప్తి మిగిలిందన్నారు. లోకేష్ ఎక్కడ ఏ డిగ్రీ చదివీడో చెప్పాలన్న సాయి రెడ్డి.. ఆయన కనీసం తండ్రి పేరే చెప్పలేడని... ఎమ్మెల్యేగా కూడా పనికి రాని వ్యక్తిని రాష్ట్రానికి సీఎం చేయాలని చంద్రబాబు ఎలా భావించాడో అర్థంకాలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
"2024లో టిడిపి అధికారంలోకి రాలేదు అనేది చంద్రబాబుకి తెలుసని.., చెప్పిన ఆయన...పప్పు నాయుడు, తుప్పు నాయుడు రాష్ట్రానికి ఏం చేయరని...ఎవరైనా ఏమైనా చేస్తే అడ్డుకుంటారని చురకలు అంటించారు. టీడీపీ ఒక కుల పార్టిగా తయారు అయ్యిందని.., ఎవరైనా జీవితంలో పైకి వస్తే.. అతనిని నేనే పైకి తీసుకొచ్చాను అని అంటూ డబ్బా కొట్టుకుంటారని పంచ్ విసిరారు. ఇదే తీరులో నారాయణ, చైతన్య విద్యా సంస్థలకు ఉందన్నారు. ఎక్కడో విద్యార్ధి చదివి ఉండే వారిని మా వద్దనే చదివాడు అని చెప్పుకుంటారని... చంద్రబాబు ఎప్పుడూ బాగు పడతాడో అని అర్ధం కావడం లేదు" అని విజయసాయి రెడ్డి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.